Magha Amavasya: ఈరోజు మాఘ అమావాస్య, సూర్య గ్రహణం.. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు.. కష్టాలు తొలగిపోతాయి!

ఈరోజు ఫిబ్రవరి 17, మంగళవారం, మాఘ అమావాస్య. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఈరోజు అమావాస్య పైగా సూర్య గ్రహణం, పైగా పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. ఈరోజు కొన్ని నియమాలను పాటించినట్లయితే కష్టాలన్నీ తీరిపోతాయి. ఈరోజు గ్రహణ సమయంలో పాటించాల్సినవి, అమావాస్య విధి విధానాల గురించి చూసేద్దాం.

Published on: Feb 17, 2026 10:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమావాస్య తిధికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈరోజు ఫిబ్రవరి 17, మంగళవారం, మాఘ అమావాస్య. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఈరోజు అమావాస్య పైగా సూర్య గ్రహణం, పైగా పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. ఈరోజు కొన్ని నియమాలను పాటించినట్లయితే కష్టాలన్నీ తీరిపోతాయి. ఈరోజు గ్రహణ సమయంలో పాటించాల్సినవి, అమావాస్య విధి విధానాల గురించి చూసేద్దాం.

Magha Amavasya: ఈరోజు మాఘ అమావాస్య, సూర్య గ్రహణం.. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు (pinterest)
Magha Amavasya: ఈరోజు మాఘ అమావాస్య, సూర్య గ్రహణం.. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు (pinterest)

సూర్యగ్రహణం, మాఘ అమావాస్య

ఈరోజు మధ్యాహ్నం 3:20 నుంచి రాత్రి 08:00 వరకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే భారతదేశంలో కనిపించదు, సూతక కాలం కూడా పరిగణించబడదు. గ్రహణ నియమాలు పాటించకపోయినా, ఈ శక్తివంతమైన రోజు అమావాస్య నియమాలను పాటించేటట్టు చూసుకోండి.

మాఘ అమావాస్య నాడు సమస్యలు తొలగిపోవాలంటే ఈ శక్తివంతమైన పరిహారాలు పాటించండి

గుమ్మడికాయ, నల్లదారం

అమావాస్య నాడు దుష్టశక్తుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంటి గుమ్మం ముందు బూడిద గుమ్మడికాయను కట్టుకుంటే మంచిది. గుమ్మడికాయను కట్టడం వలన కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీలైతే కాళ్లకు నల్ల దారం కట్టుకోండి. ఆడవారు ఎడమ కాలికి, మగవారు కుడి కాలికి నల్ల దారం కట్టుకుంటే మంచిది. నరదిష్టి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీకటాక్షం కూడా కలుగుతుంది.

నెయ్యి దీపాలను వెలిగించండి

అమావాస్య రోజు లక్ష్మీదేవికి నెయ్యి దీపాలను వెలిగిస్తే మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు ఇదే. కనుక పేదరికంతో బాధపడుతున్న వారు, సమస్యలు ఉన్నవారు వాటిని తొలగించుకోవడానికి లక్ష్మీదేవి ఎదుట నెయ్యి దీపాలను పెట్టండి. రెండు నెయ్యి దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం వలన అఖండ రాజయోగం కలుగుతుంది.

నారపీడ పరిహారాలు

ఈ శక్తివంతమైన రోజు నీటిలో ఉప్పు వేసి స్నానం చేస్తే నరపీడ మొత్తం తొలగిపోతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం కలగాలంటే స్నానం చేసే నీళ్లలో యాలకులను వేసి స్నానం చేయడం మంచిది. అప్పుల బాధలతో సతమతమవుతున్న వారు ఈ అమావాస్య నాడు బీరువాను ఒక తడిగుడ్డతో తుడిచి, దానిపై గంధం రాసి బొట్టు పెట్టండి.

ఐశ్వర్యం కలగాలంటే ఇలా చేయండి

తమలపాకులు ధనలక్ష్మీ దేవిని ఇంటికి తీసుకొస్తాయి. కాబట్టి ఈ శక్తివంతమైన రోజున పర్సులో రెండు తమలపాకులను పెట్టుకుని, కొన్ని వాస్తు పాటించండి. అనవసరమైనవి, పాత కాగితాలు, బిల్లులు వంటివి తొలగించండి. ఎప్పుడూ కూడా పర్సులో అనవసరమైనవి, పాత కాగితాలు వంటివి ఉండకూడదు. ఎప్పటికప్పుడు పర్సును శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా పాటిస్తే మంచిది

  • అమావాస్యనాడు మాంసాహారం తినడం కూడా మంచిది కాదు.
  • సాయంత్రం 6 తర్వాత ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలను వెలిగించండి. ఆ తర్వాత ఆ దీపం నూనెలో యాలకులను వేయండి. దీంతో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది. బాధలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.
  • అదృష్టం కలిసి రావాలంటే అమావాస్య నాడు నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి. దీంతో అదృష్టం కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు కూడా తొలగిపోతాయి.
  • అమావాస్య నాడు సాయంత్రం రావి చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేయండి. కుదిరితే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి.
  • వివాహంలో ఆటంకాలు ఏర్పడుతున్న వారు అమావాస్య నాడు మర్రిచెట్టుకు పసుపు దారాన్ని కట్టి ప్రదక్షిణలు చేయడం మంచిది. అలాగే సంతానం కావాలనుకునే వారు కూడా ఈ పరిహారాన్ని పాటించొచ్చు.
  • మంగళవారం కనకదుర్గమ్మకు ఇష్టమైన రోజు. కాబట్టి అమావాస్య మంగళవారం వచ్చినందున రాహుకాలంలో అమ్మవారి ఆలయానికి వెళ్లి నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే మంచిది. ఇలా ఈ పరిహారాలను పాటించినట్లయితే ఏ సమస్యలైనా తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.
  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More