ఆగస్టు 12 సూర్యగ్రహణం ఎప్పుడు? ఎక్కడ కనిపిస్తుంది? ఏ రాశులకు ఎలా ఉంటుంది?

2026 ఆగస్టు 12న ఈ ఏడాదిలో రెండోది, చివరిదైన సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది భారత్‌లో కనిపించకపోవడంతో సూతక కాలం, మతపరమైన నియమాలు వర్తించవు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశిలో ఏర్పడే ఈ గ్రహణం అన్ని రాశులపై ప్రభావం చూపనుంది. 

Published on: Aug 4, 2026, 09:30:50 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఖగోళంలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఈ ఏడాదికి సంబంధించి రెండోది, చివరిదైన సూర్యగ్రహణం ఆగస్టు 12న కనువిందు చేయనుంది. అయితే ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు కాబట్టి దేశంలో ఎలాంటి మతపరమైన నియమాలు, సూతక కాలం వర్తించవు. అయినప్పటికీ జ్యోతిష్య శాస్త్ర పరంగా ఈ గ్రహణ ప్రభావం సమస్త రాశులపై ఉంటుందని ప్రముఖ జ్యోతిష్యులు స్పష్టం చేస్తున్నారు.

ఆగస్టు 12 సూర్యగ్రహణం ఎప్పుడు? ఎక్కడ కనిపిస్తుంది? ఏ రాశులకు ఎలా ఉంటుంది?
ఆగస్టు 12 సూర్యగ్రహణం ఎప్పుడు? ఎక్కడ కనిపిస్తుంది? ఏ రాశులకు ఎలా ఉంటుంది?

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణాన్ని ఒక శక్తివంతమైన ఖగోళ పరిణామంగా భావిస్తారు. ఏ రాశిలో అయితే గ్రహణం ఏర్పడుతుందో, ఆ ప్రభావం దానికి పదిహేను రోజుల ముందు నుంచి, ఆ తర్వాత పదిహేను రోజుల వరకు కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం కర్కాటక రాశిలో సంభవించనుంది.

ఏ రాశులపై ఎలాంటి ప్రభావం?

ఈసారి ఏర్పడే సూర్యగ్రహణం కర్కాటక రాశిలోనే వస్తుండటంతో, ఆ రాశికి చెందిన చంద్రుని ప్రభావం కారణంగా ఈ రాశివారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే అన్ని రాశులకూ చెడు జరుగుతుందని అనుకోవడానికి వీలేదు. కొన్ని రాశుల వారికి ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్యులు వెల్లడిస్తున్నారు.

సూర్య గ్రహణం.. అదృష్ట రాశులు ఇవే

కర్కాటక రాశిలో ఈ గ్రహణం ఏర్పడుతున్నప్పటికీ, కన్య, మకర రాశుల వారికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే మీన రాశి వారికి కూడా ఆశించిన మేర శుభ ఫలితాలు దక్కుతాయి.

జీవితంలో సానుకూల మార్పులు: ఈ శుభప్రదమైన రాశుల వారికి రాబోయే రోజుల్లో ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ఎలాంటి పెద్ద పెద్ద అడ్డంకులు లేకుండా పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీస్‌లో మంచి వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ధన ప్రవాహం ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతుంది.

కర్కాటక రాశి వారు అప్రమత్తంగా ఉండాలి

గ్రహణం జరిగే కర్కాటక రాశి వారికి మాత్రం ఈ సమయం కొద్దిగా సవాల్‌తో కూడుకున్నదిగా ఉంటుంది. ఈ రాశి జాతకులు ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. డబ్బు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అనవసర ఖర్చులను నియంత్రించుకోకపోతే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఆరోగ్యం విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం.

గ్రహణ సమయం, ఎక్కడ కనిపిస్తుంది?

భారత కాలమానం ప్రకారం ఆగస్టు 12 రాత్రి 09:04 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ సూర్యగ్రహణం, ఆగస్టు 13 తెల్లవారుజామున 04:25 నిమిషాలకు ముగుస్తుంది. ఆ సమయంలో భారత్‌లో రాత్రి కావడంతో పాటు ఈ గ్రహణం మన దేశంలో అసలు కనిపించదు. అందువల్ల ఎలాంటి పూజా నియమాలు పాటించాల్సిన అవసరం లేదు.

గ్రీన్‌ల్యాండ్, స్పెయిన్, పోర్చుగల్ ఉత్తర భాగాలు, రష్యన్ ఆర్కిటిక్ ప్రాంతాలు అలాగే ఐస్‌లాండ్‌లో ఈ సూర్యగ్రహణం స్పష్టంగా కనిపించనుంది. విదేశాల్లో ఉన్న తెలుగువారు ఆ ప్రాంతాలకు తగినట్లుగా నిబంధనలను పరిశీలించవచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More