సంవత్సరంలో వచ్చే 24 ప్రదోష వ్రతాల పుణ్యఫలాన్ని కేవలం ఒక్క ప్రత్యేకమైన ప్రదోష రోజున ఎలా పొందాలో తెలుసుకోండి. సోమ ప్రదోష వ్రత శుభ ముహూర్తం, పూజా విధానం పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

హిందూ సంప్రదాయంలో శివారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలలో వచ్చే త్రయోదిశి తిథిని ప్రదోష వ్రతంగా ఆచరిస్తారు. కృష్ణ పక్షం, శుక్ల పక్షం చొప్పున ప్రతినెలా రెండుసార్లు ఈ వ్రతం వస్తుంది. సూర్యాస్తమయ సమయాన్ని ప్రదోష కాలంగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం త్రయోదశి తిథి, ప్రదోష కాలం కలిసివచ్చే సమయం మహాదేవుని పూజకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
ఏడాదికి మొత్తం 24 ప్రదోష వ్రతాలు వస్తాయి. కొన్ని సందర్భాలలో అధిక మాసం వస్తే ఈ సంఖ్య 25 లేదా 26కి చేరుకుంటుంది. ప్రతి వ్రతానికి దాని ప్రత్యేకత ఉన్నప్పటికీ, అన్ని ప్రదోష వ్రతాల ఫలితాన్ని ఒకే ఒక వ్రతంతో దక్కించుకునే అవకాశం ఉందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
ఏడాది మొత్తం వ్రతాల ఫలితం ఒక్కరోజే
సంవత్సరంలో వచ్చే 24 ప్రదోష వ్రతాలలో ఏదో ఒక రోజున భక్తిశ్రద్ధలతో ఈ చిన్న పరిహారం చేస్తే ఏడాది పొడవునా చేసిన ప్రదోష వ్రతాల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ప్రదోష కాలంలో ఒక రాగి చెంబుతో నీరు, ఒక నెయ్యి దీపం తీసుకుని సమీపంలోని శివాలయానికి వెళ్లాలి. అక్కడ భోళా శంకరునికి జలాభిషేకం నిర్వహించాలి. ఆ తర్వాత మీ చేతిని శివలింగానికి తాకించి, స్వామివారి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఏడాదిలో వచ్చే అన్ని ప్రదోష వ్రతాల ఫలం లభిస్తుందని భక్తుల గాఢమైన నమ్మకం.
నేడు సోమ ప్రదోష వ్రతం.. పూజా ముహూర్తం
పంచాంగం ప్రకారం నేడు (ఆగస్టు 10, 2026) ఉదయం 04:30 గంటలకు త్రయోదశి తిథి ప్రారంభమైంది. ఇది రేపు అనగా ఆగస్టు 11 తెల్లవారుజామున 01:24 గంటల వరకు కొనసాగుతుంది. నేడు ప్రదోష పూజకు రాత్రి 09:15 నుండి రాత్రి 11:07 వరకు అత్యంత అనుకూలమైన ముహూర్తం ఉంది. పూజ చేయడానికి మొత్తం 1 గంట 53 నిమిషాల సమయం లభిస్తోంది.
వ్రత నియమాలు, సోమ ప్రదోష విశిష్టత
ప్రదోష వ్రతం ఆచరించే వారు బ్రహ్మ ముహూర్తాన లేచి తలస్నానం చేయాలి. శివుని విగ్రహం లేదా ప్రతిమ ముందు కూర్చుని పవిత్రమైన మనసుతో వ్రత సంకల్పం చేసుకోవాలి.
{{/usCountry}}ప్రదోష వ్రతం ఆచరించే వారు బ్రహ్మ ముహూర్తాన లేచి తలస్నానం చేయాలి. శివుని విగ్రహం లేదా ప్రతిమ ముందు కూర్చుని పవిత్రమైన మనసుతో వ్రత సంకల్పం చేసుకోవాలి.
{{/usCountry}}సోమవారంతో ప్రదోషం కలిసి వస్తే దానిని 'సోమ ప్రదోష వ్రతం' అంటారు. ఇది పరమశివునికి అత్యంత ప్రీతికరమైనది. ఈ వ్రతం ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత, అష్టైశ్వర్యాలు, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అంతేకాకుండా జాతకంలో చంద్రుని వల్ల కలిగే అశుభ ప్రభావాలు తొలగిపోతాయి.
వ్రత పారణ ఎప్పుడు?
సోమ ప్రదోష వ్రత విరమణ (పారణ) రేపు అనగా ఆగస్టు 11, మంగళవారం రోజున చేస్తారు. సాధారణంగా ప్రదోష వ్రతం సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటుంది. ఆగస్టు 11న ఉదయం 5:47 గంటలకు సూర్యోదయం అవుతుంది. ఆ సమయం తర్వాత భక్తులు తమ వ్రతాన్ని విరమించవచ్చు.