సోమ ప్రదోష వ్రతం 2026: ఈ ఒక్క రోజు ఈ పరిహారం చేస్తే.. 24 ప్రదోషాల పుణ్యఫలం!

ఆగస్టు 10, 2026న సోమ ప్రదోష వ్రతం వచ్చింది. త్రయోదశి తిథి, ప్రదోష కాలం కలిసివచ్చే ఈ రోజును శివారాధనకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రదోష కాలంలో శివలింగానికి జలాభిషేకం చేసి, నెయ్యి దీపం వెలిగించడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తుల నమ్మకం.  

Published on: Aug 10, 2026, 09:30:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంవత్సరంలో వచ్చే 24 ప్రదోష వ్రతాల పుణ్యఫలాన్ని కేవలం ఒక్క ప్రత్యేకమైన ప్రదోష రోజున ఎలా పొందాలో తెలుసుకోండి. సోమ ప్రదోష వ్రత శుభ ముహూర్తం, పూజా విధానం పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

సోమ ప్రదోష వ్రతం 2026: ఈ ఒక్క రోజు ఈ పరిహారం చేస్తే.. 24 ప్రదోషాల పుణ్యఫలం! (pinterest)
సోమ ప్రదోష వ్రతం 2026: ఈ ఒక్క రోజు ఈ పరిహారం చేస్తే.. 24 ప్రదోషాల పుణ్యఫలం! (pinterest)

హిందూ సంప్రదాయంలో శివారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలలో వచ్చే త్రయోదిశి తిథిని ప్రదోష వ్రతంగా ఆచరిస్తారు. కృష్ణ పక్షం, శుక్ల పక్షం చొప్పున ప్రతినెలా రెండుసార్లు ఈ వ్రతం వస్తుంది. సూర్యాస్తమయ సమయాన్ని ప్రదోష కాలంగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం త్రయోదశి తిథి, ప్రదోష కాలం కలిసివచ్చే సమయం మహాదేవుని పూజకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

ఏడాదికి మొత్తం 24 ప్రదోష వ్రతాలు వస్తాయి. కొన్ని సందర్భాలలో అధిక మాసం వస్తే ఈ సంఖ్య 25 లేదా 26కి చేరుకుంటుంది. ప్రతి వ్రతానికి దాని ప్రత్యేకత ఉన్నప్పటికీ, అన్ని ప్రదోష వ్రతాల ఫలితాన్ని ఒకే ఒక వ్రతంతో దక్కించుకునే అవకాశం ఉందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

ఏడాది మొత్తం వ్రతాల ఫలితం ఒక్కరోజే

సంవత్సరంలో వచ్చే 24 ప్రదోష వ్రతాలలో ఏదో ఒక రోజున భక్తిశ్రద్ధలతో ఈ చిన్న పరిహారం చేస్తే ఏడాది పొడవునా చేసిన ప్రదోష వ్రతాల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ప్రదోష కాలంలో ఒక రాగి చెంబుతో నీరు, ఒక నెయ్యి దీపం తీసుకుని సమీపంలోని శివాలయానికి వెళ్లాలి. అక్కడ భోళా శంకరునికి జలాభిషేకం నిర్వహించాలి. ఆ తర్వాత మీ చేతిని శివలింగానికి తాకించి, స్వామివారి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఏడాదిలో వచ్చే అన్ని ప్రదోష వ్రతాల ఫలం లభిస్తుందని భక్తుల గాఢమైన నమ్మకం.

నేడు సోమ ప్రదోష వ్రతం.. పూజా ముహూర్తం

పంచాంగం ప్రకారం నేడు (ఆగస్టు 10, 2026) ఉదయం 04:30 గంటలకు త్రయోదశి తిథి ప్రారంభమైంది. ఇది రేపు అనగా ఆగస్టు 11 తెల్లవారుజామున 01:24 గంటల వరకు కొనసాగుతుంది. నేడు ప్రదోష పూజకు రాత్రి 09:15 నుండి రాత్రి 11:07 వరకు అత్యంత అనుకూలమైన ముహూర్తం ఉంది. పూజ చేయడానికి మొత్తం 1 గంట 53 నిమిషాల సమయం లభిస్తోంది.

వ్రత నియమాలు, సోమ ప్రదోష విశిష్టత

ప్రదోష వ్రతం ఆచరించే వారు బ్రహ్మ ముహూర్తాన లేచి తలస్నానం చేయాలి. శివుని విగ్రహం లేదా ప్రతిమ ముందు కూర్చుని పవిత్రమైన మనసుతో వ్రత సంకల్పం చేసుకోవాలి.

సోమవారంతో ప్రదోషం కలిసి వస్తే దానిని 'సోమ ప్రదోష వ్రతం' అంటారు. ఇది పరమశివునికి అత్యంత ప్రీతికరమైనది. ఈ వ్రతం ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత, అష్టైశ్వర్యాలు, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అంతేకాకుండా జాతకంలో చంద్రుని వల్ల కలిగే అశుభ ప్రభావాలు తొలగిపోతాయి.

వ్రత పారణ ఎప్పుడు?

సోమ ప్రదోష వ్రత విరమణ (పారణ) రేపు అనగా ఆగస్టు 11, మంగళవారం రోజున చేస్తారు. సాధారణంగా ప్రదోష వ్రతం సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటుంది. ఆగస్టు 11న ఉదయం 5:47 గంటలకు సూర్యోదయం అవుతుంది. ఆ సమయం తర్వాత భక్తులు తమ వ్రతాన్ని విరమించవచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More