...
...
Next Story

Spiritual Remedies: ఈ భక్తి మార్గాలను అస్సలు వదలకండి.. ఉద్యోగం, వివాహం, చదువు - ఏ సమస్యకైనా సొల్యూషన్!

Spiritual Remedies: జీవితంలో సంతోషం, విజయం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ శ్రమతో పాటు దైవబలం తోడైనప్పుడే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మీ సమస్య ఏదైనాఉద్యోగం, వ్యాపారం, పెళ్లి లేదా సంతానం వాటికి ఆధ్యాత్మిక పరిష్కారాలు మరియు పారాయణ విధులను ఇక్కడ తెలుసుకోండి.

Published on: May 1, 2026, 12:31:04 IST
Advertisement

ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని, అనుకున్నవి జరగాలని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అవి పూర్తి కావు. అయితే అనుకున్నదే సాధించాలన్న విజయాన్ని అందుకోవాలని, ప్రయత్నంతో పాటుగా ఈ భక్తి మార్గాలని కూడా ఫాలో అవ్వండి. సనాతన ధర్మంలో ప్రతి కార్యానికి కూడా దైవస్మరణను ఆది చేయాలని ఆచార వేత్తలు చెప్పారు. గ్రహ స్థితి అనుకూలంగా లేకపోతే కూడా అనుకున్న వాటిని పూర్తి చేయలేము, విజయాలనే చేరుకోలేము.

Spiritual Remedies: ఈ భక్తి మార్గాలను అస్సలు వదలకండి.. ఉద్యోగం, వివాహం, చదువు - ఏ సమస్యకైనా సొల్యూషన్! (pinterest)
Spiritual Remedies: ఈ భక్తి మార్గాలను అస్సలు వదలకండి.. ఉద్యోగం, వివాహం, చదువు - ఏ సమస్యకైనా సొల్యూషన్! (pinterest)

జపాలు, ఉపవాసాలు, పారాయణ ద్వారా మనసుకు స్థిరత్వం కలుగుతుంది. కార్యానికి అనుకూలత కలుగుతుంది. విజయం వరిస్తుంది. దైవానుగ్రహంతో ఉండే పనులు కచ్చితంగా పూర్తవుతాయి. అయితే మరి ఈరోజు విజయాల కోసం భక్తి మార్గాల గురించి చూద్దాం. వీటిలో మీకు ఏం కావాలో, దానికి తగ్గ పరిహారాలు పాటిస్తే చక్కగా విజయాన్ని అందుకోవచ్చు. అనుకున్నవన్నీ పూర్తి చేయొచ్చు. ఏ ఆటంకాలు, ఇబ్బందులు ఉండవు.

విజయాన్ని అందుకోవడానికి ఈ భక్తి మార్గాలని అనుసరించండి:

వ్యాపార అభివృద్ధి:

చాలా మంది వ్యాపారంలో నష్టపోతూ ఉంటారు. ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలాంటి వారు వ్యాపార అభివృద్ధి కోసం కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సంపదకి మూలం ధర్మ సంపాదన అని కూడా మీరు గుర్తుపెట్టుకుని ఆచరించడం మంచిది.

ఉద్యోగ ప్రయత్నాలు:

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్న ఉద్యోగం రావట్లేదా? అయితే ప్రతిరోజు ఆదిత్య హృదయం, సూర్యాస్తకం పఠించండి. సూర్య నమస్కారాలు చేయండి. దీంతో శుభ ఫలితాలు కలుగుతాయి.

కుటుంబ ఐక్యత:

కుటుంబంలో ఏదో ఒక ఇబ్బంది వస్తుందా? పదే పదే గొడవలు అవుతున్నాయా? అయితే కుటుంబ ఐక్యత కోసం విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం పారాయణ చేయండి. దీంతో శాంతి కలుగుతుంది. సంబంధాలు బాగుంటాయి.

చదువు, ఏకాగ్రత:

సంతానం కలగాలంటే గోపాల స్తోత్రాన్ని భక్తితో పఠించండి. దీంతో సంతానం కలిగి సంతోషంగా ఉంటారు.

వివాహం అవ్వాలంటే:

వివాహం అవ్వకుండా చాలా కాలం నుంచి సింగిల్‌గా ఉంటున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించట్లేదా? అయితే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయండి. సంకల్పంతో ఈ పారాయణం చేయడం వలన కోరుకున్న జీవిత భాగస్వామి, కోరుకున్న వ్యక్తి జీవిత భాగస్వామి అవుతారు. సంతోషంగా ఉంటారు.

రుణ బాధల నుంచి బయటపడడానికి:

నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. గ్రహ శాంతి కలిగి ఈ సమస్య తొలగి ఆనందంగా ఉంటారు.

ఇలా వీటిని పాటించి ప్రయత్నం చేసినట్లయితే విజయాన్ని పొందవచ్చు, కష్టాల నుంచి బయటపడొచ్చు, ఆనందంగా ఉండొచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe