జర్మనీలో వైభవోపేతంగా శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం

జర్మనీ మాన్​హైమ్​ పట్టణంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జర్మనీలోని జీయర్​ ఎడ్యుకేషనల్​ ట్రస్ట్​ నిర్వహించింది.

Published on: Jan 17, 2026, 13:29:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చిన్న జీయర్​ స్వామి దివ్య మంగళ శాసనములతో జర్మనీ మాన్​హైమ్​లోని జీయర్​ ఎడ్యుకేషనల్​ ట్రస్ట్​ నిర్వహించిన శ్రీ గోదా రంగనాథ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ధనుర్మాసం సందర్భంగా నిర్వహించిన ఈ కళ్యాణాన్ని వీక్షించేందుకు నగరంలోని తెలుగువారు, భక్తులు తరలివెళ్లారు. అందరు ఎంతగానో శ్రమపడి అమ్మవారిని, స్వామి వారిని, ప్రాంగణాన్ని అత్యంత వైభవోపేతంగా అలంకరించి, భక్తిశ్రద్ధలతో పూజించారు.

శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం..
శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం..

మాన్​హైమ్​ పట్టణంలో తొలిసారి..

జర్మనీ మాన్​హైమ్​ పట్టణంలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని మొట్టమొదటిసారిగా నిర్వహించింది జీయర్​ ఎడ్యుకేషనల్​ ట్రస్ట్​. ఆగమ శాస్త్ర విద్వాంసులు అయిన శ్రీ గోపాలకృష్ణ రంగరాజన్​, దేవనాథన్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.

శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం
శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం
  • మౌని అమావాస్య 2026: మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది? తేదీ, శుభ సమయంతో పాటు ఏం చెయ్యాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

అంతేకాదు, సంక్రాంతి నేపథ్యంలో ఇదే వేదికగా పిల్లలకు భోగి పండ్లు కూడా పోశారు. తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఎన్నో జ్ఞాపకాలను పోగుచేసుకున్నారు.

శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం
శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం

ఈ సంస్థ గత నాలుగేళ్లుగా, ప్రతి శ్రీరామ నవమికి సీతారాముల కళ్యాణాన్ని జర్మనీలో ఘనంగా నిర్వహిస్తోంది.

జర్మనీలో నివశిస్తున్న భారతీయులందరికి భారత సంస్కృతి, సాంప్రదాయాలు తెలియజేసే ఉద్దేశంతో జీయర్​ ఎడ్యుకేషనల్​ ట్రస్ట్​ ఈ కార్యక్రమాలను జరుపుతోంది.

సొంత వారికి దూరంగా, విదేశాల్లో జీవిస్తున్న వారందరికి ఈ కార్యక్రమాలు చక్కటి వేదికగా మారుతున్నాయి. పిల్లలకు భారత దేశ సంస్కృతిని వివరించేందుకు తల్లిదండ్రులు ఈ వేదికను ఉపయోగించుకుంటున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More