హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వైశాఖ మాసంలో వచ్చే 'మోహినీ ఏకాదశి'కి ఒక ప్రత్యేకత ఉంది. పురాణ కాలంలో దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మథనం చేసినప్పుడు ఉద్భవించిన అమృతాన్ని కేవలం దేవతలకే దక్కేలా చేసేందుకు శ్రీమహావిష్ణువు అపురూపమైన సుందరాంగి 'మోహిని' అవతారాన్ని ధరించారు. విష్ణుమూర్తి ఈ రూపంలో ప్రత్యక్షమైన రోజే వైశాఖ శుక్ల ఏకాదశి. అందుకే ఈ రోజును మోహినీ ఏకాదశిగా భక్తకోటి అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటుంది.
రాత్రి జాగరణతో పుణ్యఫలాలు….
ఈ ఏకాదశి పర్వదినాన కేవలం ఉపవాసం ఉండటమే కాకుండా… రాత్రివేళ చేసే జాగరణకు శాస్త్రాలు విశేష ప్రాముఖ్యతను ఇచ్చాయి. మోహినీ ఏకాదశి నాడు సాయంత్రం పూజ అనంతరం రాత్రంతా హరినామ స్మరణతో మేల్కొని ఉండటం వల్ల ఊహించని పుణ్యఫలాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
సాధారణ సమయంలో భగవంతుని నామాన్ని స్మరిస్తే వచ్చే ఫలితం కంటే, ఏకాదశి రాత్రి జాగరణ సమయంలో ఒక్క క్షణం 'గోవింద' నామాన్ని పలికితే నాలుగు రెట్ల ఫలితం లభిస్తుంది. అదే ఒక గంట పాటు నామజపం చేస్తే ఏకంగా లక్ష రెట్ల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
రాత్రంతా నిద్రపోకుండా భగవంతుని ఎదుట సంకీర్తనలు చేస్తూ… నృత్యం చేసే భక్తుడిని చూసి శ్రీహరి మురిసిపోతారని పెద్దలు అంటారు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తికి పుట్టినప్పటి నుంచి మరణం వరకు చేసిన సత్కర్మల ఫలం వంద రెట్లు పెరుగుతుంది. ఈ జాగరణ సమయంలో పురాణ పఠనం చేయడం, కీర్తనలు పాడటం వల్ల వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు చేసినంత పుణ్యం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
"మోహినీ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల గత జన్మల పాపాలు సైతం పటాపంచలు అవుతాయి," అని ఆధ్యాత్మిక వేత్తలు వివరిస్తున్నారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల కేవలం పాపాలు తొలగిపోవడమే కాకుండా, జీవితంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో ధర్మరాజు కూడా శ్రీహరి అనుగ్రహం కోసం ఈ మోహినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారని పురాణ గాథలు చెబుతున్నాయి.
{{/usCountry}}"మోహినీ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల గత జన్మల పాపాలు సైతం పటాపంచలు అవుతాయి," అని ఆధ్యాత్మిక వేత్తలు వివరిస్తున్నారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల కేవలం పాపాలు తొలగిపోవడమే కాకుండా, జీవితంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో ధర్మరాజు కూడా శ్రీహరి అనుగ్రహం కోసం ఈ మోహినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారని పురాణ గాథలు చెబుతున్నాయి.
{{/usCountry}}ఈ ఏడాది మోహినీ ఏకాదశి రోజు ఆకాశంలో ఒక అరుదైన గ్రహ గతులు కనిపిస్తున్నాయి. ధ్రువ యోగం, అమృత సిద్ధి యోగం, త్రిపుష్కర్ యోగాల త్రివేణి సంగమం ఏర్పడుతోంది. ఇలాంటి శుభ యోగాల సమయంలో చేసే ఆరాధన అత్యంత శక్తివంతమైనది.