Mohini Ekadashi 2026 : మోహినీ ఏకాదశి విశిష్టత - ఈ ఒక్క రాత్రి మేల్కొంటే ఊహించని పుణ్యఫలాలు..!
వైశాఖ శుక్ల ఏకాదశి లేదా మోహినీ ఏకాదశి పర్వదినం భక్తుల పాలిట కల్పవృక్షం. శ్రీమహావిష్ణువు మోహినిగా అవతరించిన ఈ రోజున ఉపవాసం, రాత్రి జాగరణ చేస్తే కలిగే అద్భుత ఫలితాలు దక్కుతాయి.

హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వైశాఖ మాసంలో వచ్చే 'మోహినీ ఏకాదశి'కి ఒక ప్రత్యేకత ఉంది. పురాణ కాలంలో దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మథనం చేసినప్పుడు ఉద్భవించిన అమృతాన్ని కేవలం దేవతలకే దక్కేలా చేసేందుకు శ్రీమహావిష్ణువు అపురూపమైన సుందరాంగి 'మోహిని' అవతారాన్ని ధరించారు. విష్ణుమూర్తి ఈ రూపంలో ప్రత్యక్షమైన రోజే వైశాఖ శుక్ల ఏకాదశి. అందుకే ఈ రోజును మోహినీ ఏకాదశిగా భక్తకోటి అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటుంది.
రాత్రి జాగరణతో పుణ్యఫలాలు….
ఈ ఏకాదశి పర్వదినాన కేవలం ఉపవాసం ఉండటమే కాకుండా… రాత్రివేళ చేసే జాగరణకు శాస్త్రాలు విశేష ప్రాముఖ్యతను ఇచ్చాయి. మోహినీ ఏకాదశి నాడు సాయంత్రం పూజ అనంతరం రాత్రంతా హరినామ స్మరణతో మేల్కొని ఉండటం వల్ల ఊహించని పుణ్యఫలాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
సాధారణ సమయంలో భగవంతుని నామాన్ని స్మరిస్తే వచ్చే ఫలితం కంటే, ఏకాదశి రాత్రి జాగరణ సమయంలో ఒక్క క్షణం 'గోవింద' నామాన్ని పలికితే నాలుగు రెట్ల ఫలితం లభిస్తుంది. అదే ఒక గంట పాటు నామజపం చేస్తే ఏకంగా లక్ష రెట్ల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
రాత్రంతా నిద్రపోకుండా భగవంతుని ఎదుట సంకీర్తనలు చేస్తూ… నృత్యం చేసే భక్తుడిని చూసి శ్రీహరి మురిసిపోతారని పెద్దలు అంటారు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తికి పుట్టినప్పటి నుంచి మరణం వరకు చేసిన సత్కర్మల ఫలం వంద రెట్లు పెరుగుతుంది. ఈ జాగరణ సమయంలో పురాణ పఠనం చేయడం, కీర్తనలు పాడటం వల్ల వెయ్యి అశ్వమేధ యజ్ఞాలు చేసినంత పుణ్యం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
"మోహినీ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల గత జన్మల పాపాలు సైతం పటాపంచలు అవుతాయి," అని ఆధ్యాత్మిక వేత్తలు వివరిస్తున్నారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల కేవలం పాపాలు తొలగిపోవడమే కాకుండా, జీవితంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో ధర్మరాజు కూడా శ్రీహరి అనుగ్రహం కోసం ఈ మోహినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారని పురాణ గాథలు చెబుతున్నాయి.
ఈ ఏడాది మోహినీ ఏకాదశి రోజు ఆకాశంలో ఒక అరుదైన గ్రహ గతులు కనిపిస్తున్నాయి. ధ్రువ యోగం, అమృత సిద్ధి యోగం, త్రిపుష్కర్ యోగాల త్రివేణి సంగమం ఏర్పడుతోంది. ఇలాంటి శుభ యోగాల సమయంలో చేసే ఆరాధన అత్యంత శక్తివంతమైనది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

