...
...
Next Story

Subrahmanya Sashti: ఈరోజు సుబ్రహ్మణ్య షష్టి వేళ శివలింగానికి వీటిని సమర్పించండి.. అదృష్టం వరిస్తుంది, ప్రశాంతత ఉంటుంది!

ఈరోజు సుబ్రహ్మణ్య షష్టి వేళ శివపార్వతులను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే ఎంతో మంచే జరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు. ఈరోజు శివలింగానికే వీటిని సమర్పించడం మాత్రం మర్చిపోకండి.

Published on: Nov 26, 2025, 09:22:54 IST
Advertisement

ఈరోజే సుబ్రహ్మణ్య షష్టి. దీనిని స్కంద షష్టి లేదా మురుగన్ షష్టి అని కూడా అంటారు. మార్గశిర మాసం శుక్లపక్ష షష్టి నాడు సుబ్రహ్మణ్య షష్టి వస్తుంది. శివుడు కొడుకు అయినటువంటి కార్తికేయుడిని ఈరోజు ప్రత్యేకించి ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు కూడా ఈరోజు పాటిస్తూ ఉంటారు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్టి వేళ మానసిక ప్రశాంతత కలగాలంటే పరమేశ్వరుడికి వీటిని సమర్పించడం మంచిది.

సుబ్రహ్మణ్య షష్టి 2025

Subrahmanya Sashti: ఈరోజు సుబ్రహ్మణ్య షష్టి వేళ శివలింగానికి వీటిని సమర్పించండి (pinterest)
Subrahmanya Sashti: ఈరోజు సుబ్రహ్మణ్య షష్టి వేళ శివలింగానికి వీటిని సమర్పించండి (pinterest)

ఈరోజు సుబ్రహ్మణ్య షష్టి వేళ శివపార్వతులను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే ఎంతో మంచే జరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు. ఈరోజు శివలింగానికే వీటిని సమర్పించడం మాత్రం మర్చిపోకండి. ఇలా చేసినట్లయితే మీ సమస్యలన్నీ తీరే, సంతోషంగా ఉండొచ్చు.

ఈరోజు సుబ్రహ్మణ్య షష్టి వేళ శివలింగానికి వీటిని సమర్పించండి:

  1. సుబ్రహ్మణ్య షష్టి నాడు పచ్చిపాలను శివలింగానికి సమర్పించాలి. ఈ విధంగా ఆచరించడం వలన మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, ఆర్థిక సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
  2. అలాగే శివలింగానికే పెరుగుని సమర్పించండి. సుబ్రహ్మణ్య షష్టి నాడు ఇలా సమర్పించడం వలన సంతోషము ఉంటుంది. డబ్బుకి లోటు ఉండదు.
  3. శివలింగానికి ఈరోజు తేనెను సమర్పిస్తే అదృష్టం కలిసి వస్తుంది. దురదృష్టం తొలగిపోయి అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది.
  4. శివలింగానికి ఈరోజు బిల్వపత్రాలను సమర్పిస్తే కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సంపద పెరుగుతుంది, ఆనందంగా ఉండొచ్చు.
  5. చెరుకు రసాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి నాడు శివలింగానికి సమర్పిస్తే కూడా విశేష ఫలితాలు పొందవచ్చు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
  6. నల్ల నువ్వులను ఈరోజు శివలింగానికి సమర్పిస్తే శని దోషాల నుంచి బయటపడవచ్చు. డబ్బు కొరత ఉండదు, అన్ని విధాలుగా కలిసి వస్తుంది, ఆనందంగా ఉండొచ్చు.

ఇలా సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందండి

కుజ దోషాలు ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తే ఎంతో మంచి జరుగుతుంది. పెళ్లయిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే వైవాహిక జీవితంలో ఉన్న బాధలు తొలగిపోతాయి. సర్ప దోషాలను కూడా తొలగించుకోవడానికి వీలవుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks