గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పులు చేస్తూ ఉంటాయి. గ్రహాల స్థితిలో మార్పు వస్తే అది అందరి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు కలుగుతాయి, మరి కొన్నిసార్లు అశుభ ఫలితాలు వస్తాయి. సూర్యుడు, చంద్రుడి సంయోగం త్వరలో ఏర్పడబోతోంది. హోలీ పండుగ తర్వాత ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సూర్య, చంద్రుల సంయోగం వలన ఏర్పడే ఈ యోగం ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను కలిగిస్తుంది, ఎవరు సమస్యలను ఎదుర్కోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యతిపాత యోగంతో సమస్యలు

ప్రమాదకరమైన యోగంగా వ్యతిపాత యోగాన్ని భావిస్తారు. ఈ యోగం ఏర్పడినప్పుడు చంద్రుడు, సూర్యుడు మధ్య 180 డిగ్రీల దూరం ఉంటుంది. ఒకదానికొకటి ప్రత్యక్షంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ వ్యతిపాత యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి సమస్యలను కలిగించే అవకాశం ఉంది. సూర్య–చంద్రుల సంయోగంతో ఈ రాశుల వారికి సమస్యలు పెరిగే అవకాశం వుంది.
సూర్య చంద్రుల కారణంగా ఏర్పడే వ్యతిపాత యోగంతో ఈ రాశులకు సమస్యలు
1.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా గొడవలు జరగవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య కూడా విభేదాలు ఉండొచ్చు. ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఆర్థిక నష్టాలు తలెత్తే అవకాశం ఉంది. డబ్బును ఖర్చు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదర సంబంధిత సమస్యలు, రక్త సంబంధిత సమస్యలు కూడా ఉండొచ్చు. కాబట్టి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం.
2.సింహ రాశి
సింహ రాశి వారికి ఈ యోగం వలన నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. హోలీ తర్వాత మానసిక ఒత్తిడితో బాధపడవచ్చు. అనేక విధాలుగా ఇబ్బందులు రావచ్చు. సీనియర్లతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.
ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి. కుటుంబంలో గొడవలు ఉండొచ్చు. తలనొప్పి, కంటి సమస్యలు, అలసట వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
3.కుంభ రాశి
{{/usCountry}}ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి. కుటుంబంలో గొడవలు ఉండొచ్చు. తలనొప్పి, కంటి సమస్యలు, అలసట వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
3.కుంభ రాశి
{{/usCountry}}సూర్య–చంద్రుల కలయిక వలన ఏర్పడే ఈ యోగం కుంభ రాశి వారికి నష్టాలను తీసుకు రావచ్చు. ఈ సమయంలో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు చేసే ముందు బాగా ఆలోచించాలి.
స్నేహితులు, సహోద్యోగులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. రుణాలు తీసుకోవడం నివారించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు ఉండవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.