గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగితే, అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. అశుభకరమైన వైదృతి యోగం త్వరలో ఏర్పడబోతోంది. సూర్యచంద్రుల కారణంగా ఈ యోగం ఏర్పడబోతోంది. ఇది మూడు రోజుల వరకు ప్రభావాన్ని చూపిస్తుంది. దాంతో కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వైధృతి యోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైధృతి యోగం అశుభకరమైన యోగం. ఇది కొన్ని రాశుల వారికి సమస్యలను తీసుకువస్తుంది. సూర్య చంద్రులు ఉండే స్థానాన్ని బట్టి కొన్ని సార్లు ఈ వైదృతి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఆర్థికపరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి కూడా కలగవచ్చు.
కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. దృక్ పంచాంగం ప్రకారం సూర్యచంద్రుల కారణంగా ఏర్పడే వైధృతి యోగం మూడు రోజుల పాటు కొనసాగుతుంది. మొదట 2026 ఫిబ్రవరి 21, శనివారం ఉదయం 8:09 కి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఏ రాశుల వారు జాగ్రత్త తీసుకోవాలి, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వైధృతి యోగంతో ఈ రాశులకు సమస్యలు.. జాగ్రత్తగా ఉండడం మంచిది
1.మేషరాశి
మేష రాశి వారికి సూర్యచంద్రుల కారణంగా ఏర్పడే వైధృతి యోగం మానసిక ఒత్తిడి పెంచుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ పరంగా కూడా సమస్యలు రావచ్చు. పని ప్రదేశంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసరంగా మిత్రులతో గొడవలు పడకండి. ఈ సమయంలో ఈ రాశి వారికి టెన్షన్ కూడా ఎక్కువవుతుంది. తలనొప్పి, నీరసం వంటి సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండడం మంచిది.
2.తులా రాశి
తులా రాశి వారికి కూడా ఈ యోగం సమయంలో శుభ ఫలితాలు కలుగుతాయి. చిన్నపాటి ఇబ్బందులు ఎదురవొచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సరిగ్గా సమయానికి పూర్తవ్వకపోవచ్చు. కష్టపడితే మాత్రం ఫలితం వస్తుంది. వ్యాపారంలో సమస్యలు రావచ్చు. అనవసరంగా గుడ్డిగా ఎవరిని నమ్మకండి.
{{/usCountry}}తులా రాశి వారికి కూడా ఈ యోగం సమయంలో శుభ ఫలితాలు కలుగుతాయి. చిన్నపాటి ఇబ్బందులు ఎదురవొచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సరిగ్గా సమయానికి పూర్తవ్వకపోవచ్చు. కష్టపడితే మాత్రం ఫలితం వస్తుంది. వ్యాపారంలో సమస్యలు రావచ్చు. అనవసరంగా గుడ్డిగా ఎవరిని నమ్మకండి.
{{/usCountry}}ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాయామానికి సమయానికి కేటాయించండి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువవుతుంది. నీరసం, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి.
3.కర్కాటక రాశి
ఈ రాశి వారికి కూడా సమస్యలు రావచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా సమస్యలు రావచ్చు. అనవసరంగా గొడవలు పడకండి. పని ప్రదేశంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. టెన్షన్ ఎక్కువ అవుతుంది. పాత గొడవలు మళ్లీ మొదలవ్వచ్చు. అనవసరంగా లేనిపోని వాటిల్లో కలగజేసుకోవద్దు. కమ్యూనికేషన్ లేకపోవడం వలన కూడా భాగస్వామితో సమస్యలు రావచ్చు. ఉదర సంబంధిత సమస్య వచ్చే అవకాశం ఉంది.
ఈ పరిహారాలను పాటించడం మంచిది
యోగం సమయంలో శివుని పూజించడం మంచిది. శివలింగానికి పాలు, నీళ్లు సమర్పించండి. రుద్రాభిషేకం చేసుకుంటే కూడా మంచి ఫలితాలు వస్తాయి. బట్టలు, ఆహారాన్ని దానం చేస్తే మంచిది. మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.