...
...
Next Story

2027కు ముందు సూర్యుడి 3 నక్షత్ర మార్పులు - ఈ 7 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

2026 డిసెంబర్ చివరి నాటికి సూర్యుడు జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ నక్షత్రాల్లోకి మారనున్నాడు. ఈ మూడు నక్షత్ర సంచారాల వల్ల మేషం, మిథునం, కన్య సహా 7 రాశుల వారికి ఆర్థిక లాభాలు, కెరీర్ పురోగతి లభించనున్నాయి.

Published on: Nov 25, 2026, 07:52:44 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు రారాజుగా సూర్యుడిని పరిగణిస్తారు. సూర్య భగవానుడి రాశి మార్పులతో పాటు నక్షత్ర సంచారాలు కూడా ద్వాదశ రాశుల వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ప్రస్తుతం సూర్యుడు వృశ్చిక రాశిలో, శని దేవుడికి చెందిన అనూరాధ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. 2026 సంవత్సరం ముగిసి, 2027లోకి అడుగుపెట్టేలోపు సూర్యుడు ఏకంగా మూడుసార్లు తన నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు.

2027కు ముందు సూర్యుడి 3 నక్షత్ర మార్పులు
2027కు ముందు సూర్యుడి 3 నక్షత్ర మార్పులు

హిందూ పంచాంగం ప్రకారం….. డిసెంబర్ 3న సూర్యుడు జ్యేష్ఠ నక్షత్రంలోకి అడుగుపెడతాడు. ఆ తర్వాత మూల నక్షత్రంలోకి ప్రవేశించి, ఏడాది చివరలో అంటే డిసెంబర్ 29, 2026న పూర్వాషాఢ నక్షత్రంలోకి సంచరిస్తాడు.

"సంవత్సరం ముగిసేలోపు సూర్యుడు తన నక్షత్ర మండలాన్ని మూడుసార్లు మార్చుకుంటాడు. ఈ మూడు నక్షత్ర సంచారాలు దాదాపు 7 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి," అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ వివరించారు. సూర్యుడి ఈ కీలక నక్షత్ర మార్పుల వల్ల ఏయే రాశుల వారి అదృష్టం ప్రకాశించనుందో, వారికి ఎలాంటి శుభ ఫలితాలు దక్కనున్నాయో వివరంగా తెలుసుకుందాం.

మేష రాశి : ఆకస్మిక ధనలాభం

మేష రాశి వారికి సూర్యుడి మూడు నక్షత్ర సంచారాలు ఎంతో లాభదాయకంగా మారనున్నాయి. ఊహించని విధంగా ఆకస్మిక ఆర్థిక లాభాలు దక్కే సూచనలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉండి ప్రతి పనిలో విజయాన్ని అందిస్తుంది.

మిథున రాశి : పెరగనున్న ఆత్మవిశ్వాసం

మిథున రాశి జాతకులకు సూర్యుడి ఈ మూడు నక్షత్ర మార్పులు అద్భుతమైన ప్రయోజనాలను తెచ్చిపెడతాయి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు సంపద పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కన్యా రాశి : వృత్తి జీవితంలో కొత్త బాధ్యతలు

వృశ్చిక రాశి వారికి సూర్యుడి మూడు నక్షత్ర ప్రయాణాలు అత్యంత శుభదాయకంగా ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉత్సాహంగా ఉంటారు. వృత్తి లేదా వ్యక్తిగత పనుల నిమిత్తం దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయాణాలు మీకు లాభాలను చేకూరుస్తాయి.

ధనుస్సు రాశి : వ్యాపారంలో శుభవార్తలు

ధనుస్సు రాశి వారికి సూర్యుడి నక్షత్ర మార్పులు మంచి లాభాలను అందిస్తాయి. ముఖ్యంగా వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూల సమయం నడుస్తుంది. కొత్త ఒప్పందాలు కుదరడం లేదా లాభాలకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.

కుంభ రాశి : ఆదాయ వృద్ధి

కుంభ రాశి జాతకులకు సూర్యుడి మూడు ప్రయాణాలు సంతోషకరమైన వార్తలను మోసుకొస్తాయి. మీ ఆదాయ మార్గాలు పెరిగి, ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారి మధ్య అనుబంధం మరింత బలపడి, ఆనందంగా గడుపుతారు.

మీన రాశి : కెరీర్ కష్టాలకు పరిష్కారం

మీన రాశి వారికి సూర్యుడి నక్షత్ర సంచారాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యోగ జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కొంటున్న కష్టాలు, ఆటంకాలు తొలగిపోతాయి. సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుంది. అదృష్టం మీ పక్షాన నిలవడంతో అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

3- కన్యా రాశికి సూర్యుడి 3 నక్షత్ర ప్రయాణాలు ఎలా ఉంటాయి? కన్యా రాశికి సూర్యుని మూడు ప్రయాణాలు సానుకూలంగా ఉండవచ్చు. ముఖ్యమైన వృత్తి సంబంధిత పనులు అప్పగించబడవచ్చు. కొత్త వ్యక్తులను కూడా కలుసుకోవడం సాధ్యం. 4- వృశ్చికానికి సూర్యుడి 3 నక్షత్ర ప్రయాణాలు ఎలా ఉంటాయి? సూర్యుని మూడు ప్రయాణాలు వృశ్చికానికి శుభదాయకంగా ఉంటాయి. మీరు ఆరోగ్యంగా ఉంటారు మరియు ప్రయాణించవచ్చు. 5- ధనుసు రాశికి సూర్యుడి 3 నక్షత్ర ప్రయాణాలు ఎలా ఉంటాయి? సూర్యుని మూడు ప్రయాణాలు ధనుస్సుకు లాభదాయకంగా ఉండవచ్చు. వ్యాపారానికి సంబంధించిన మంచి వార్తలు రావచ్చు.

6- కుంభ రాశికి సూర్యుడి 3 నక్షత్ర ప్రయాణాలు ఎలా ఉంటాయి? కుంభ రాశి కోసం, సూర్యుని మూడు ప్రయాణాలు మంచి వార్తలను తీసుకురాగలవు. మీ ఆదాయం పెరగవచ్చు. ప్రేమ జీవితంలో ప్రేమ కొనసాగుతుంది. 7- మీనానికి సూర్యుడి 3 నక్షత్ర ప్రయాణాలు ఎలా ఉంటాయి? సూర్యుని మూడు ప్రయాణాలు మీనానికి అద్భుతంగా ఉండవచ్చు. వృత్తి జీవితంలోని కష్టాలు పరిష్కరించబడతాయి. అదృష్టం మీ పక్కన ఉంటుంది. అస్పష్టత: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా నిజం లేదా ఖచ్చితమైనది అని మేము చెప్పము. వివరమైన మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks