గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారుతూ ఉంటాయి. దాంతో అశుభ యోగాలు, శుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు గ్రహాల సంచారంతో శుభ ఫలితాలు కలుగుతాయి. దీంతో ఒక్కసారిగా జీవితం కూడా మారిపోతుంది. మరి కొన్ని రోజుల్లో, అంటే ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే రాహువు అదే రాశిలో సంచారం చేయడంతో సూర్య, రాహువుల సంయోగం ఏర్పడుతుంది. ఇది గ్రహణ యోగాన్ని ఏర్పరుస్తుంది. మార్చి మధ్య వరకు ఈ యోగం అనేక రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది.
సూర్య, రాహువుల కలయిక

ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే రాహువు అదే రాశిలో ఉండడంతో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇది గ్రహణ యోగాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశులపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఏ రాశుల వారు ఈ గ్రహణ యోగం వలన సమస్యలను ఎదుర్కొంటారు? ఏ విధమైన సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రహణ యోగంతో ఈ రాశుల వారికి సమస్యలు.. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది
1.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ రెండు గ్రహాల కారణంగా ఏర్పడే గ్రహణ యోగం సమస్యలను తీసుకొస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోవడం మంచిది కాదు. ఖర్చులు కూడా సడన్‌గా పెరిగే అవకాశాలు ఉంటాయి. దాచుకున్న డబ్బులను కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో శివుడిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.
2.కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఒత్తిడి ఎక్కువవుతుంది. పాలిటిక్స్‌కు దూరంగా ఉండండి. పని ప్రదేశంలో కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీ శత్రువులు ఈ సమయంలో కాస్త యాక్టివ్‌గా ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందుల నుంచి బయట పడడానికి కన్యా రాశి వారు గోధుమలు లేదా బెల్లం దానం చేయడం మంచిది.
3.వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణ యోగంతో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఏకాగ్రతతో నడపడం మంచిది. ఈ సమయంలో సమస్యలు తగ్గి సంతోషంగా ఉండాలంటే సూర్యుడికి సంబంధించిన మంత్రాలను రోజూ పఠించండి.
4.మీన రాశి:
{{/usCountry}}వృశ్చిక రాశి వారు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణ యోగంతో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఏకాగ్రతతో నడపడం మంచిది. ఈ సమయంలో సమస్యలు తగ్గి సంతోషంగా ఉండాలంటే సూర్యుడికి సంబంధించిన మంత్రాలను రోజూ పఠించండి.
4.మీన రాశి:
{{/usCountry}}మీన రాశి వారికి సూర్య, రాహువుల కలయికతో ఏర్పడే గ్రహణ యోగం సమస్యలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కెరీర్‌లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది. ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. సమస్యలను తగ్గించుకోవాలంటే ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయడం మంచిది.