Sun Transit Benefits: రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారికి రాజయోగం.. డబ్బే డబ్బు!
Sun Transit Benefits: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాజు సూర్యుడు మే 25న రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ నక్షత్ర మార్పు వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం వరించడమే కాకుండా, సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ముఖ్యంగా మూడు రాశుల వారు ఆర్థికంగా ఊహించని స్థాయికి ఎదుగుతారు.
Sun Transit Benefits: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగితే, అది ద్వాదశ రాశులపై ప్రభావం చూపిస్తుంది. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడు తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. మే 25న చూస్తే, సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.

రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. మరి ఈ సమయంలో ఏ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది
ఈ సమయంలో ఈ రాశుల వారి పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. అలాగే అదృష్టం కూడా పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.
రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ రాశుల వారికి భారీగా లాభాలు
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ సమయంలో బాగా కలిసి రాబోతోంది. ఈ రాశి వారు సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజంలో గౌరవ, మర్యాదలను పొందుతారు. బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది.
2.కన్యా రాశి:
కన్యా రాశి వారికి కూడా ఇదే శుభ సమయం అని చెప్పొచ్చు. రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడంతో ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు విజయవంతంగా పూర్తవుతాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా భారీగా లాభాలు వస్తాయి.
3.సింహ రాశి:
సింహ రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఊహించని విధంగా ప్రయోజనాలు పొందుతారు. గోల్డెన్ అవకాశాలు మీ కెరీర్‌లోకి ప్రవేశిస్తాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ లేదా ట్రాన్స్‌ఫర్‌ను పొందుతారు. పూర్వీకుల నుంచి ఆస్తుల లాభం కలుగుతుంది. ఆర్థికపరంగా కూడా ఈ రాశి వారికి బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి రాజయోగం వంటిది. ఇలా ఈ రాశి వారు కూడా అనేక విధాలుగా లాభాలను పొందుతారు, సంతోషంగా ఉంటారు.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


