...
...
Next Story

హస్త నక్షత్రంలోకి సూర్యుడు - అక్టోబర్ 10 వరకు ఈ రాశులకు తిరుగులేని రాజయోగం! పెరగనున్న బ్యాంక్ బ్యాలెన్స్

సెప్టెంబర్ 27న సూర్యుడు హస్త నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 10 వరకు ఉండే ఈ సంచారంతో మేషం, సింహం సహా 5 రాశుల వారికి అపార ధనలాభం, ఉద్యోగంలో పదోన్నతులు ఖాయంగా కనిపిస్తున్నాయి.

Published on: Sep 21, 2026, 11:27:30 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పు మాత్రమే కాదు, నక్షత్ర పరివర్తనం కూడా ఎంతో కీలకమైనదిగా పరిగణిస్తారు. నవగ్రహాల అధిపతి అయిన సూర్య భగవానుడు నిర్ణీత వ్యవధిలో తన నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో 2026 సెప్టెంబర్ 27న సూర్యుడు హస్త నక్షత్రంలోకి సంచారం చేయనున్నారు. సుమారు 14 రోజుల పాటు ఇదే నక్షత్రంలో కొనసాగి…. అక్టోబర్ 10న చిత్ర నక్షత్రంలోకి అడుగుపెడతారు.

హస్త నక్షత్రంలోకి సూర్యుడు
హస్త నక్షత్రంలోకి సూర్యుడు

వేద జ్యోతిష్యం ప్రకారం… హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు. జ్యోతిష్య నిబంధనల ప్రకారం సూర్యుడు, చంద్రుల మధ్య మైత్రీ భావం ఉంటుంది. మిత్ర గ్రహమైన చంద్రుని నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ఈ సంచారం ముఖ్యంగా ఐదు రాశుల జాతకులకు అత్యంత శుభప్రదంగా, ఆకస్మిక ధనయోగాన్ని అందించేదిగా మారనుంది. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇవే…

మేష రాశి:

మేష రాశి జాతకులకు ఈ నక్షత్ర గోచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. శత్రువులపై అధిపత్యం సాధిస్తారు. ధైర్యసాహసాలు పెరిగి చేపట్టిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఏర్పడి, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. దీర్ఘకాలంగా కోర్టుల్లో నలుగుతున్న వివాదాలు మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు అందుతుంది.

మిథున రాశి:

మిథున రాశి వారికి ఈ సమయం అన్ని విధాలా కలిసి వస్తుంది. సొంత ఇల్లు, భూమి లేదా కొత్త వాహనం కొనుగోలు చేయాలనే నిరీక్షణ ఫలిస్తుంది. కుటుంబంలో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తాయి. ఆఫీసులో మీరు పడే కష్టాన్ని ఉన్నతాధికారులు గుర్తించి ప్రశంసిస్తారు. తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా స్థిరమైన పరిస్థితులు ఏర్పడతాయి.

సింహ రాశి:

ధనుస్సు రాశి వారికి సూర్యుని నక్షత్ర మార్పు అపారమైన సానుకూలతను తీసుకొస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. హోదా పెరగడంతో పాటు పదోన్నతి పొందే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. పాత అప్పులు తీరడంతో పాటు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం.

మకర రాశి:

సూర్యుని ఈ సంచారం మకర రాశి జాతకులకు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. అనుకోని మార్గాల ద్వారా ఆర్థిక లాభాలు వచ్చి పడతాయి. దీనివల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది. పెట్టుబడులకు ఇది మంచి సమయం. వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks