త్వరలో పుష్య నక్షత్రంలోకి సూర్యుడు - అదృష్టం వరించే లక్కీ రాశులివే

గ్రహాల రాజు సూర్య భగవానుడు త్వరలో పుష్య నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. శనిదేవుడికి చెందిన ఈ నక్షత్రంలో సూర్యుని సంచారం కారణంగా మేషం, మిథునం, సింహ రాశుల వారికి అదృష్టం పట్టనుంది.

Published on: Jul 6, 2026, 07:36:50 IST
By , नई दिल्ली
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
Sun Rashifal Surya Gochar
Sun Rashifal Surya Gochar

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాజుగా పిలిచే సూర్య భగవానుడు త్వరలోనే తన నక్షత్ర గమనాన్ని మార్చబోతున్నాడు. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న సూర్యుడు, సోమవారం నాడు నక్షత్ర సంచారం చేయనున్నారు. ఉదయాన్నే సూర్య దేవుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. జ్యోతిష్య నిధుల ప్రకారం పుష్య నక్షత్రానికి అధిపతి శని గ్రహం. సూర్యుడు, శని గ్రహాల మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ, ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి అమితమైన లాభాలను, మరికొన్ని రాశుల వారికి కొన్ని సవాళ్లను తీసుకురానుంది.

సూర్య భగవానుడి ఈ నక్షత్ర మార్పు జూలై 20వ తేదీ ఉదయం 11:33 గంటలకు ప్రారంభమై…. ఆగస్టు 3వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుంది. అంటే దాదాపు 15 రోజుల పాటు సూర్యుడు శని నక్షత్రమైన పుష్య నక్షత్రంలోనే సంచరిస్తారు. ఈ కాలంలో సూర్యుని మారుతున్న కదలిక వల్ల ముఖ్యంగా మూడు రాశుల వారి అదృష్టం బంగారంలా ప్రకాశిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

మిథున రాశి :

మిథున రాశి వారికి శని నక్షత్రంలో సూర్యుని సంచారం అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి ఊహించని శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా కలిసివచ్చే కాలం కావడంతో సంపద, ఆస్తులు పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. గత కొంతకాలంగా తల్లి ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన చెందుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. కుటుంబం, పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న డబ్బుకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి.

మేష రాశి:

శని నక్షత్రంలో సూర్యుని సంచారం మేష రాశి ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారబోతోంది. గతంలో ఆస్తి లేదా రియల్ ఎస్టేట్ రంగంలో మీరు చేసిన పాత పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను అందించి, మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయి. వ్యాపారవేత్తలకు ఈ సమయం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. సూర్య భగవానుడి ప్రత్యేక అనుగ్రహం వల్ల సమాజంలో మీ స్థానం, గౌరవ ప్రతిష్టలు గణనీయంగా పెరుగుతాయి.

సింహ రాశి :

సింహ రాశి వారికి కూడా సూర్యుని నక్షత్ర మార్పు అద్భుతమైన విజయాలను చేకూరుస్తుంది. కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాల్లో మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు, ఈ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కొన్నేళ్లుగా నిలిచిపోయి సాగదీస్తున్న పనులన్నీ ఇప్పుడు వేగవంతం అవుతాయి. వ్యాపారంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మంచి లాభాలు ఆర్జిస్తారు.

చేయాల్సిన పరిహారాలు….

జాతకంలో సూర్య గ్రహం బలంగా ఉంటే సమాజంలో కీర్తి, ప్రతిష్టలు, ఉన్నత హోదా లభిస్తాయి. సూర్యుని నక్షత్ర మార్పు సమయంలో సూర్యగ్రహాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం (నీరు) ఇవ్వడం ఎంతో మంచిది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య నమ్మకాలు, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చినది మాత్రమే. దీనిని పూర్తిగా నిజమని, ఖచ్చితమైనదని మేము ధృవీకరించడం లేదు. మరింత సమాచారం మరియు పూర్తి వివరాల కోసం సంబంధిత రంగ నిపుణులను లేదా జ్యోతిష్యులను సంప్రదించగలరు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More