...
...
Next Story

వృశ్చిక రాశిలో సూర్య సంచారం, ఈ రాశులకు గోల్డెన్ డేస్ మొదలు.. డబ్బు, ప్రొమోషన్లతో పాటు అనేకం

గ్రహాల రాకుమారుడు సూర్యుడు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తూ ఉంటాడు.సూర్యుని సంచారంతో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కొన్ని రాశి వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. మరి సూర్య సంచారం ఏ రాశి వారికి బాగా కలిసి వస్తుంది, ఏ రాశి వారు ఎక్కువ లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Oct 14, 2025, 07:00:00 IST
Advertisement

గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. గ్రహాల రాకుమారుడు సూర్యుడు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తూ ఉంటాడు. సూర్యుని సంచారంతో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కొన్ని రాశి వారు మాత్రం ఎక్కువ లాభాలను పొందుతారు. మరి సూర్య సంచారం ఏ రాశి వారికి బాగా కలిసి వస్తుంది, ఏ రాశి వారు ఎక్కువ లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

వృశ్చిక రాశిలోకి సూర్యుడు

వృశ్చిక రాశిలోకి సూర్యుడు (pinterest)
వృశ్చిక రాశిలోకి సూర్యుడు (pinterest)

సుమారు సంవత్సరం తర్వాత గ్రహాల రాజు సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి అనేక మార్పులు వస్తాయి, అనేక విధాలుగా లాభాలను పొందుతారు. అదృష్టం కూడా కలిసి వస్తుంది. సంవత్సరం తర్వాత నవంబర్ నెలలో సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

నాలుగు రాశుల వారికి ఈ సంచారంతో భారీగా లాభాలు కలగబోతున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది, ఊహించని విధంగా లాభాలు వస్తాయి. మరి ఇక ఏ ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది, ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం.

వృశ్చిక రాశిలో సూర్య సంచారం, ఈ రాశులకు గోల్డెన్ టైం

1.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి సూర్యసంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు గౌరవ మర్యాదలను పొందుతారు, పనిలో పర్ఫెక్ట్‌గా ఉంటారు. పెళ్లి కాని వారికి ఇది శుభ సమయం. ఈ రాశి ఉద్యోగులు కూడా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ప్రమోషన్లు రావచ్చు. రాజకీయాల్లో ఉన్నవారికి కూడా ఇదే చక్కటి సమయం.

2.సింహ రాశి:

మకర రాశి వారికి సూర్య సంచారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారి అదృష్టం పెరుగుతుంది, జీవితమే మారిపోవచ్చు. ఆదాయం పెరుగుతుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారవేత్తలకు కూడా ఇదే చక్కటి సమయం. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఇది వరకు పెట్టుబడి పెట్టిన వాటి నుంచి ఎక్కువ లాభాలు పొందుతారు.

4.కుంభ రాశి:

కుంభ రాశి వారికి సూర్య సంచారం సానుకూల మార్పులను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ప్రమోషన్లు పొందవచ్చు. వ్యాపారులకి కూడా ఇది మంచి సమయం. కెరియర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. కొత్త బాధ్యతలను చేపడతారు. వ్యాపారవేత్తలకి కూడా ఇది మంచి సమయం.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe