...
...
Next Story

మృగశిర నక్షత్రంలోకి సూర్యుడు - ఇవాళ్టి నుంచి ఈ 3 రాశుల వారికి తిరుగుండదు!

జూన్ 8న సూర్య భగవానుడు రోహిణి నక్షత్రం వీడి అంగారకుడికి చెందిన మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మార్పు వల్ల తుల, ధనుస్సు, సింహ రాశుల వారికి అద్భుతమైన ధనలాభాలు, కెరీర్‌లో పురోగతి లభించనున్నాయి.

Published on: Jun 8, 2026, 07:05:21 IST
By , नई दिल्ली
Prefer HTon Google
Advertisement

గ్రహాల రాజు, ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి నక్షత్ర సంచారంలో కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ప్రతి నెలా రాశి మారడమే కాకుండా…. నెలలో రెండు లేదా మూడు సార్లు నక్షత్ర సంచారం కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రోహిణి నక్షత్రంలో ఉన్న సూర్యుడు, తన గమనాన్ని మార్చుకుంటూ మృగశిర నక్షత్రంలోకి అడుగుపెడుతున్నాడు.

మృగశిర నక్షత్రంలోకి సూర్యుడి సంచారం
మృగశిర నక్షత్రంలోకి సూర్యుడి సంచారం

జూన్ 8, 2026 సోమవారం మధ్యాహ్నం 01:39 గంటలకు సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 22 మధ్యాహ్నం వరకు సూర్యుడి సంచారం ఇదే నక్షత్రంలో కొనసాగుతుంది. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు (అంగారకుడు). సూర్యుడు, కుజుడికి పరమ మిత్రుడు. అందువల్ల అంగారకుడి నక్షత్రంలోకి సూర్యుడి రాక కొన్ని రాశుల వారి జాతకాలను పూర్తిగా మార్చేయబోతోంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ సమయం అదృష్టాన్ని, ఊహించని ధనలాభాలను తెచ్చిపెడుతుంది.

తులా రాశి :

మృగశిర నక్షత్రంలో సూర్యుడి ప్రవేశం తులా రాశి వారికి అత్యంత లాభదాయకంగా మారబోతోంది. ఈ సమయంలో మీకు సంతాన సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి స్నేహితులు, సహోద్యోగుల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దక్కుతుంది. కుటుంబంలో ఏవైనా విభేదాలు ఉంటే, జీవిత భాగస్వామి సహాయంతో అవి సమసిపోతాయి. ఆర్థికంగా కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆదాయ మార్గాలు పెరిగి, బ్యాంక్ బ్యాలెన్స్ పుంజుకుంటుంది.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి వారికి ఈ నక్షత్ర సంచారం ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా బలంగా మారుతుంది. ఈ కాలంలో మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ పని చేపట్టినా పూర్తి పట్టుదలతో, కష్టపడి పూర్తి చేస్తారు. కెరీర్ పరంగా అక్కడక్కడా కొన్ని చిన్న చిన్న సవాళ్లు ఎదురైనప్పటికీ, అవి తాత్కాలికమేనని గుర్తుంచుకోవాలి. మీ ప్రతిభతో వాటిని అధిగమిస్తారు. ఈ సమయంలో దూర ప్రయాణాలు లేదా విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి.

సింహ రాశి :

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks