జ్యోతిష్య శాస్త్రంలో రంగులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వారంలో ఏడు రోజులు ఒక్కో గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. ప్రతి గ్రహానికి ప్రత్యేకమైన రంగు ఉంటుంది. వారంలోని రోజుకి అనుగుణంగా శుభప్రదమైన దుస్తులు ధరించడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది. గ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రోజు ఏ రంగు అదృష్టాన్ని తీసుకొస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రోజు ఏ దుస్తులు ధరించాలి? ఏ రంగు అదృష్టాన్ని తీసుకువస్తుంది?
ఆదివారం

వారంలోని రోజుకి అనుగుణంగా శుభప్రదమైన దుస్తులు ధరించడం చాలా మంచిది. ఆదివారం సూర్యుడికి అంకితం చేయబడిన రోజు. ఆ రోజు ఎరుపు, నారింజ లేదా గులాబీ రంగు దుస్తులు ధరించడం వలన శుభ ఫలితాలను చూడొచ్చు. సూర్యుడిని శక్తి, ఆత్మవిశ్వాసం, గౌరవం, నాయకత్వం మొదలైన వాటికి కారకుడిగా భావిస్తారు.
సోమవారం
సోమవారం చంద్రుడు, పరమశివుడికి అంకితం చేయబడిన రోజు. ఆ రోజు తెలుపు, లేత నీలం లేదా వెండి రంగు దుస్తులను ధరించడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు.
మంగళవారం
మంగళవారం కుజుడు, ఆంజనేయస్వామికి అంకితం చేయబడిన రోజు. ఆ రోజు ముదురు ఎరుపు, కాషాయం, నారింజ రంగు దుస్తులను ధరిస్తే మంచి ఫలితాలను చూడొచ్చు.
బుధవారం
బుధవారం వినాయకుడికి సంబంధించిన రోజు. ఆ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు.
గురువారం
గురువారం మహావిష్ణువుకి అంకితం చేయబడిన రోజు. ఆ రోజు పసుపు, బంగారు లేదా నారింజ రంగు దుస్తులను ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. పైగా గురువుని జ్ఞానం, విద్య, ధర్మం, ఐశ్వర్యం, అదృష్టానికి కారకుడిగా చెప్తారు.
శుక్రవారం
శుక్రవారం శుక్ర గ్రహానికి, మహాలక్ష్మీ దేవికి అంకితం చేయబడినది. ఆ రోజు గులాబీ, తెలుపు, లేత నీలం లేదా ప్రకాశవంతమైన రంగులను ధరిస్తే మంచి ఫలితాలను చూడొచ్చు.
శనివారం
{{/usCountry}}శుక్రవారం శుక్ర గ్రహానికి, మహాలక్ష్మీ దేవికి అంకితం చేయబడినది. ఆ రోజు గులాబీ, తెలుపు, లేత నీలం లేదా ప్రకాశవంతమైన రంగులను ధరిస్తే మంచి ఫలితాలను చూడొచ్చు.
శనివారం
{{/usCountry}}శనివారం శని దేవుడికి సంబంధించిన రోజు. ఆ రోజు నలుపు, ముదురు నీలం, ఊదా రంగు దుస్తులను ధరించడం వలన అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.
నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.