...
...
Next Story

సూర్య సంచారం 2026 :డిసెంబర్ 31 వరకు ఈ 5 రాశుల వారికి లక్కీ డేస్ - ఊహించని అవకాశాలు!

వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం 2026 చివరి నాటికి సూర్య సంచారంతో 5 రాశుల వారికి అద్భుతమైన యోగం పట్టనుంది. కెరీర్, వ్యాపారం, ఆర్థిక రంగాల్లో వీరికి తిరుగులేని విజయాలు లభిస్తాయి.

Published on: Jul 13, 2026, 14:19:05 IST
Advertisement

జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాజుగా భావించే సూర్య భగవానుడి గమనానికి ఎంతో ప్రాధాయం ఉంది. జాతకంలో సూర్యుడు బలమైన స్థానంలో ఉంటే ఆ వ్యక్తి సమాజంలో ఉన్నత గౌరవాన్ని, తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకుంటారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు, కెరీర్ ఎదుగుదలలో సూర్యుడి అనుగ్రహం కీలకంగా మారుతుంది. అయితే, 2026 ఏడాది ముగిసే సమయానికి సూర్యుడు వివిధ రాశులలో సంచరించనున్నారు.

సూర్య గోచారం 2026
సూర్య గోచారం 2026

ఈ క్రమంలో డిసెంబర్ 31 వరకు కొన్ని ప్రత్యేక రాశులపై సూర్య భగవానుడి కరుణాకటాక్షాలు మెండుగా ఉండనున్నాయి. వీరికి ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాలలో ఊహించని అవకాశాలు తలుపు తట్టనున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

మేష రాశి :

ఈ సమయం మేష రాశి వారికి ఎంతో అద్భుతంగా మారనుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ కష్టానికి తగ్గ పూర్తి ప్రతిఫలాన్ని అందుకుంటారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి సరికొత్త బాధ్యతలు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులలో ఎట్టకేలకు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఎంతో మెరుగవుతుంది. పెట్టుబడుల విషయంలో కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే భారీ లాభాలను ఆర్జించవచ్చు.

సింహ రాశి :

సింహ రాశికి అధిపతి స్వయంగా సూర్య భగవానుడే. అందువల్ల ఈ ఏడాది చివరకు మీ జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలతో పాటు పదోన్నతి (ప్రమోషన్), జీతాల పెంపు వంటి శుభవార్తలు అందుతాయి. వ్యాపారస్తులు చాలా కాలంగా నిలిచిపోయిన తమ పాత పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు అంతకంతకూ పెరుగుతాయి.

వృశ్చిక రాశి :

ధనుస్సు రాశి జాతకులు తమ కెరీర్‌లో వేగంగా ముందుకు దూసుకెళ్లేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి త్వరలోనే శుభవార్త అందుతుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగేలా ప్రణాళికలు వేసుకుంటారు. చాలా కాలంగా మార్కెట్లో లేదా ఇతరుల వద్ద చిక్కుకుపోయిన మీ సొమ్ము తిరిగి మీ చేతికి అందుతుంది.

కుంభ రాశి :

కుంభ రాశి వారికి డిసెంబర్ 31 వరకు అనేక సువర్ణ అవకాశాలు తలుపు తడుతుంటాయి. కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి అడుగులు పడతాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త వనరులు లభిస్తాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు వేసుకున్న ప్రణాళికలు విజయవంతంగా సాగుతాయి. కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడానికి మంచి సమయం దొరుకుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా, పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సజావుగా పూర్తవుతాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks