దేవశయని ఏకాదశి 2026: తేదీ, పూజా ముహూర్తం, ఉపవాస నియమాలు, చాతుర్మాస్య విశిష్టత!

ఆషాఢ శుక్ల ఏకాదశిగా ప్రసిద్ధి చెందిన దేవశయని (హరిశయని) ఏకాదశి 2026 జూలై 25, శనివారం వచ్చింది. ఈ రోజున విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఆచరిస్తే పాపాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని విశ్వాసం. ఇదే రోజు చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. 

Published on: Jul 13, 2026, 14:00:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ప్రత్యేకించి ఆరాధిస్తాము. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది.

దేవశయని ఏకాదశి 2026: తేదీ, పూజా ముహూర్తం, ఉపవాస నియమాలు, చాతుర్మాస్య విశిష్టత! (pinterest)
దేవశయని ఏకాదశి 2026: తేదీ, పూజా ముహూర్తం, ఉపవాస నియమాలు, చాతుర్మాస్య విశిష్టత! (pinterest)

జూలై 25న దేవశయని ఏకాదశి

దేవశయని ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. అలాగే, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన సకల శుభాలు కలుగుతాయి. దేవశయని ఏకాదశిని హరిశయని ఏకాదశి అని కూడా అంటారు.

ధర్మశాస్త్రాల ప్రకారం, ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు విష్ణువు క్షీరసాగరంలో నాలుగు నెలల పాటు యోగనిద్రను ఉపక్రమిస్తారు. ఆ రోజు నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఉండే కాలాన్ని చాతుర్మాస్య వ్రత కాలం అంటారు.

ఈ దేవశయని ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించి ఉపవాసం ఉండడం వలన తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.

దేవశయని ఏకాదశి 2026 తేదీ, ముహూర్తం

వైదిక పంచాంగం ప్రకారం చూసినట్లయితే, ఈ ఏడాది ఆషాఢ శుక్ల ఏకాదశి జూలై 25, శనివారం నాడు వచ్చింది. అందువల్ల ఆ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి.

ఏకాదశి తిథి ప్రారంభం: జూలై 24, ఉదయం 9:12 గంటలకు.

ఏకాదశి తిథి ముగింపు: జూలై 25, ఉదయం 11:30 గంటలకు.

వ్రత ఆచరణ: జూలై 25, శనివారం.

పారణ సమయం: ఉపవాసాన్ని జూలై 26, ఉదయం 5:39 నుంచి 8:02 గంటల వరకు విరమించడానికి అనుకూలంగా ఉంది.

చాతుర్మాసంలో శుభకార్యాలు చేయకూడదు

ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు శుభకార్యాలు చేయరు. ఈ నాలుగు నెలల పాటు వివాహాలు, గృహప్రవేశాలు, అక్షరాభ్యాసాలు, ఉపనయనాలు వంటివి జరపరు. ఈ కాలాన్ని ఆధ్యాత్మిక సాధనకు, దానధర్మాలకు, విష్ణు నామస్మరణకు కేటాయించడం మంచిది. ఈ నెలల్లో చేసే జపాలు, తపాలు, వ్రతాలు ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తాయి.

పరమేశ్వరుడికి బాధ్యత

విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నప్పుడు సృష్టి నిర్వహణ బాధ్యతలను పరమేశ్వరుడు స్వీకరిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే చాతుర్మాసంలో విష్ణువుతో పాటు శివుని కూడా ఆరాధించడం మంచిది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఎన్నో లాభాలు పొందవచ్చు. ఇంట్లో అశాంతి కూడా తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More