జూన్, జులై నెలల్లో పుట్టిన వారి నిజమైన నైజం ఇదే.. మీతో మ్యాచ్ అయిందా?
జూన్, జులై నెలల్లో జన్మించిన వారి వ్యక్తిత్వం, అలవాట్లు, కెరీర్ ఎలా ఉంటాయో జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.
పుట్టిన నెల ఆధారంగా కూడా చాలా విషయాలు చెప్పచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, ఒక వ్యక్తి పుట్టిన నెల స్వభావం, ఆలోచన విధానం, భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఏడాదిలో ఉండే 12 నెలల్లో ఒక్కో నెలకు ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది.

అయితే జూన్, జూలై నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు? వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది? ఇతరులతో పోల్చుకుంటే ఈ నెలలో పుట్టిన వాళ్లు ఎలా విభిన్నంగా ఉంటారు? నిజానికి ఇతరులతో పోల్చుకుంటే ఎంతో భిన్నమైన మనస్తత్వంతో ఈ నెలలో పుట్టిన వాళ్లు ఉంటారు. అలాగే సమాజంలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. ఇక ఈ నెలలో పుట్టిన వారి గుణగణాలు, కెరీర్, ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుందనేది క్లుప్తంగా చూసేద్దాం.
జూన్ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు?
జూన్ నెలలో పుట్టిన వారు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరు మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వీరి నవ్వు కూడా ఎవరినైనా సులభంగా పడేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, జూన్ నెలలో పుట్టిన వారు మహా తెలివైన వారు. అలాగే ఎక్కడికి వెళ్లినా కూడా అందరి దృష్టిని మీరు ఇట్టే ఆకర్షించగలరు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని చూస్తూ ఉంటారు.
జూన్ నెలలో పుట్టిన వాళ్లకు స్నేహితులు చాలా తక్కువ ఉంటారు. క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. సినిమా, కళలు, రచన రంగాల్లో బాగా రాణించగలరు. కానీ త్వరగా మూడ్‌ను మార్చుకుంటారు. కోపం ఒక క్షణంలో వస్తే, మరో క్షణం ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. ప్రేమ విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు. భాగస్వామిని కూడా బాగా చూసుకుంటారు.
జూలై నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు?
జూలై నెలలో పుట్టిన వారు భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కఠినంగా, గంభీరంగా కనిపించినా మనసు మాత్రం వెన్నలా ఉంటుంది. ఇతరుల బాధలను కూడా త్వరగా అర్థం చేసుకుని, చేతనైన సాయం చేస్తారు. జూలైలో పుట్టిన వారికి ఆత్మగౌరవం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరి దగ్గర కూడా గౌరవాన్ని తగ్గించుకోవడానికి ఇష్టపడరు.
ఈ నెలలో పుట్టిన వారు కుటుంబానికి, బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీరు ఒక రంగాన్ని ఎంచుకుని, అందులో కష్టపడి పైకి వస్తారు. వ్యాపారంలో కూడా బాగా విజయాలను అందుకుంటారు. డబ్బును పొదుపు చేయడం కూడా వీరికి బాగా తెలుసు. భవిష్యత్తు కోసం ఎప్పుడూ మంచి ప్లాన్లు వేసుకుంటారు. ప్రేమ, పెళ్లి విషయంలో కూడా సిన్సియర్‌గా ఉంటారు. అలాగే భాగస్వామికి తమ పూర్తి సపోర్ట్ ఇస్తారు. భాగస్వామి కోసం వారు చాలా కష్టపడతారు కూడా.
జూన్ vs జూలై
ఈ రెండు నెలల్లో పుట్టిన వారి మధ్య ప్రధాన తేడాలు ఏంటంటే, జూన్ నెలలో పుట్టిన వారు అందరితో బాగా కలిసిపోతారు. జూలై నెలలో పుట్టిన వారు మాత్రం అంత ఈజీగా కలవలేరు. అలాగే జూన్ నెలలో పుట్టిన వారు మాటలతో మాయ చేస్తారు. జూలైలో పుట్టిన వారు చేతలతో, నమ్మకంతో ఇతరుల మనసును ఇట్టే గెలుచుకుంటారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


