ఈరోజు రాశి ఫలాలు 13 జూలై 2026: సోమవారం శివయ్య అనుగ్రహం ఎవరికి? మీ రాశి ఫలితం తెలుసుకోండి
శివయ్యకు అత్యంత ప్రీతికరమైన సోమవారం గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి శుభఫలితాలను అందిస్తుండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తోంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు ఉద్యోగం, ధనం, కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి.
ఆధ్యాత్మికంగా శివయ్యకు అత్యంత ప్రీతికరమైన సోమవారం నాడు గ్రహ గతులు ఎలా ఉన్నాయి? మీ రాశి ప్రకారం ఈ రోజు మీకు ఎదురయ్యే సవాళ్లు, శుభ ఫలితాలు ఏమిటి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ప్రతి రోజు ఉదయం లేవగానే రాశి ఫలాలు చూసుకోవడం మనలో చాలా మందికి అలవాటు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన పనులను ప్లాన్ చేసుకోవడానికి ఒక మార్గదర్శకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 2026 జూలై 13, సోమవారం నాడు గ్రహాల స్థితిగతులు కొన్ని రాశుల వారికి ఊహించని శుభవార్తలను అందిస్తే, మరికొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. ఈ రోజు మీ రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం.
ఈరోజు రాశి ఫలాలు
మేషం (Aries): ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయండి. చిన్న చిన్న అనవసర ఖర్చులు మీ బడ్జెట్‌ను దెబ్బతీయవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే కుతూహలం పెరుగుతుంది. స్నేహితులతో చర్చలు జరిపి విలువైన సమాచారాన్ని సేకరించండి. సహనం వహిస్తేనే క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
వృషభం (Taurus): అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి కావడానికి సమయం పడుతుంది. సాయంత్రం వరకు వేచి ఉండక తప్పదు. మీ పనితీరు పట్ల సంతృప్తి చెందుతారు. చిన్న చిన్న విజయాలను కూడా కుటుంబంతో కలిసి ఆస్వాదించండి. మానసిక ప్రశాంతత ఈ రోజు మీకు పెద్ద ఆస్తి.
మిథునం (Gemini): నేడు మిథున రాశి వారు ఒకేసారి అన్ని పనులు పూర్తి చేయాలని ప్రయత్నించకండి. ఓపికగా ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయడం ఉత్తమం. మీ ఆలోచనలను సన్నిహితులతో పంచుకోండి. ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళితే గమ్యాన్ని సులభంగా చేరుకుంటారు.
కర్కాటకం (Cancer): ఈ రోజు మీ ఉత్సాహం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. మీ దృష్టి అంతా లక్ష్యాలపైనే ఉండాలి. ఆచరణాత్మకమైన ఆలోచనలు ఈ రోజు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి.
సింహం (Leo): ఇతరుల పట్ల మీరు చూపే సానుభూతి, ప్రేమ మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి. ఏ పని చేసినా తొందరపడకుండా ప్రశాంతంగా చేయండి. శక్తివంతంగా, ఉత్సాహంగా ఉండటం వల్ల పెండింగ్ పనులు త్వరగా పూర్తవుతాయి.
కన్య (Virgo): మీ తెలివితేటలను పనిలో చూపిస్తారు. చిన్న చిన్న చిట్కాలు, కొత్త ఐడియాలు మీ పని భారాన్ని తగ్గిస్తాయి. ముఖ్యమైన విషయాలను నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మీ జ్ఞాపకశక్తికి తోడ్పడుతుంది.
తుల (Libra): ఈ రోజు తులా రాశి వారి పనులు సులభంగానే పూర్తవుతాయి. చర్చలు సఫలమవుతాయి. సన్నిహితుల సలహాలు మీకు ఉపయోగపడతాయి. చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ పనులు చేస్తే అలసట అనిపించదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి.
వృశ్చికం (Scorpio): తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో క్లిష్టమైన పనులను సైతం పూర్తి చేస్తారు. ఒత్తిడి లేకుండా పని చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి.
ధనుస్సు (Sagittarius): మనశ్శాంతిని ఇచ్చే పనులకే ప్రాధాన్యత ఇవ్వండి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతుతో పనుల్లో పురోగతి కనిపిస్తుంది.
మకర (Capricorn): కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తిని చూపిస్తారు. స్నేహితులతో కలిసి ఐడియాలు షేర్ చేసుకోవడం వల్ల మంచి పరిష్కారాలు దొరుకుతాయి. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి రోజు.
కుంభం (Aquarius): నేడు కుంభ రాశి వారు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లండి. కుటుంబంతో కలిసి ప్లాన్ చేసుకోండి. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం వల్ల కొత్త మార్గాలు సుగమం అవుతాయి.
మీనం (Pisces): సలహాలు తీసుకోవడంలో తప్పు లేదు. ఓపికగా ఉండటం వల్ల మీకే లాభం. మీలోని క్రియేటివిటీ కొత్త అవకాశాలకు దారి తీస్తుంది. అందరితో స్నేహపూర్వకంగా ఉండండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


