ఖగోళ శాస్త్రవేత్తలు, ఆకాశ వీక్షకులకు ఆగస్టు 12 అత్యంత కీలకమైన రోజుగా నిలవనుంది. పగలు, రాత్రి సమయాల్లో ఆకాశంలో సాధారణంగా కనిపించని అరుదైన, అద్భుతమైన దృశ్యాలు ఈ రోజున ఆవిష్కృతం కానున్నాయి. ఖగోళంలో ఒకేసారి ఆరు గ్రహాలు—బుధుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్—ఒకే వరుసలో క్యూ కట్టినట్లు దర్శనమివ్వడం ఈ రోజు ప్రత్యేకత. అదే సమయంలో ఆకాశంలో ఉల్కాపాతం (రాలే నక్షత్రాలు) గరిష్ఠ స్థాయికి చేరనుంది. సూర్యగ్రహణం కారణంగా ఆకాశం చీకటిమయంగా మారడంతో ఈ ఉల్కాపాతాన్ని కళ్లతో స్పష్టంగా వీక్షించే అరుదైన అవకాశం లభిస్తుంది.
హరియాళీ అమావాస్య రోజున సంభవించే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడనుంది. 1999 సంవత్సరం తర్వాత స్పెయిన్ ప్రధాన భూభాగంలో ఒక సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సూర్యాస్తమయానికి సరిగ్గా ముందు ఉత్తర స్పెయిన్ పరిధిలో సూర్యుడు ఈ ప్రత్యేక రూపంలో దర్శనమిస్తాడు. దీంతో ఈ గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, భారత్‌లో దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే అంశాలపై ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఈ సూర్యగ్రహణ ఘట్టం ఆగస్టు 12, 13 తేదీల మధ్యరాత్రి వేళ సంభవిస్తుంది. భారతీయ కాలమానం ప్రకారం ఆగస్టు 13న రాత్రి 09:04 గంటలకు గ్రహణం ప్రారంభమై…. అర్ధరాత్రి దాటిన తర్వాత 01:27 గంటలకు ముగుస్తుంది. ఆగస్టు 12 రాత్రి గడిచాక, అంటే ఆగస్టు 13న వేకువజామున 11:16 గంటల సమయానికి గ్రహణం గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది.
మన దేశంలో కనిపిస్తుందా….?
ఈ సూర్యగ్రహణం ప్రారంభమయ్యే సమయానికి భారతదేశంలో రాత్రి వేళ కావడం, సూర్యుడు క్షితిజ సమాంతర రేఖకు దిగువన ఉండటం వల్ల ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు. భారత్‌లో గ్రహణం గోచరించకపోవడం వల్ల ఇక్కడ సూతక కాలం నిబంధనలు వర్తించవని పండితులు స్పష్టం చేశారు. సాధారణంగా సూర్యగ్రహణం ప్రారంభం కావడానికి 12 గంటల ముందే సూతక కాలం మొదలవుతుంది. ఈ సమయంలో పూజలు, శుభకార్యాలు నిలిపివేయడంతో పాటు దేవాలయాల ద్వారాలను మూసివేస్తుంటారు. అయితే ఈ గ్రహణానికి అలాంటి నియమాలు వర్తించవు.
గ్రహణ ప్రభావం ఎక్కడ?
ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రధానంగా ఐస్లాండ్, గ్రీన్లాండ్, స్పెయిన్ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని 95 నుంచి 100 శాతం వరకు పూర్తిగా కప్పివేస్తాడు. దాంతో పగటిపూట కూడా గాఢాంధకారం అలుముకుని, రాత్రిని తలపిస్తుంది. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో పక్షులు ప్రశాంతంగా తమ గూళ్లకు చేరుకుంటాయి, స్వల్పంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయి. గ్రహణం వీడుతున్న కొద్దీ ఆకాశం నిర్మలంగా మారి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకుంటాయి.
{{/usCountry}}ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రధానంగా ఐస్లాండ్, గ్రీన్లాండ్, స్పెయిన్ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని 95 నుంచి 100 శాతం వరకు పూర్తిగా కప్పివేస్తాడు. దాంతో పగటిపూట కూడా గాఢాంధకారం అలుముకుని, రాత్రిని తలపిస్తుంది. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో పక్షులు ప్రశాంతంగా తమ గూళ్లకు చేరుకుంటాయి, స్వల్పంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయి. గ్రహణం వీడుతున్న కొద్దీ ఆకాశం నిర్మలంగా మారి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకుంటాయి.
{{/usCountry}}ఈ గ్రహణం రోజున రాత్రి వేళ ఆకాశంలో పడే నక్షత్రాల (ఉల్కల) అద్భుత దృశ్యాన్ని నేరుగా చూడవచ్చు. ఈ దృశ్యాలను మరింత స్పష్టంగా తిలకించాలనుకునేవారు కాంతి వెలుగులు తక్కువగా ఉండి, ఆకాశం నిర్మలంగా ఉన్న ప్రదేశాలను ఎంచుకోవాలి. బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్‌ల సహాయంతో ఈ అరుదైన ఖగోళ వింతలను స్పష్టంగా వీక్షించవచ్చు.