...
...
Next Story

రాహువు నక్షత్రంలోకి సూర్యుడు - జూన్ లో ఈ 4 రాశుల వారికి లక్ మామూలుగా ఉండదు..!

Sun Transit Ardra Nakshatra : 2026 జూన్ 22న సూర్య భగవానుడు రాహువు నక్షత్రమైన 'ఆర్ద్ర'లోకి ప్రవేశించబోతున్నాడు. ఈ నక్షత్ర మార్పు వల్ల సింహం, కన్య, వృశ్చికం, కుంభ రాశుల వారికి కెరీర్, ధనలాభం, సమాజంలో కీర్తి ప్రతిష్టలు దక్కే అద్భుతమైన యోగం పట్టనుంది.

Published on: May 22, 2026, 13:17:21 IST
By , नई दिल्ली
Prefer HTon Google
Advertisement

Sun Transit Ardra Nakshatra 2026 : జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాజుగా పిలవబడే సూర్య దేవుడికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. సూర్యుడిని ఆత్మవిశ్వాసం, ఉన్నత పదవులు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, రాజ్యాధికారం మరియు విజయానికి కారకుడిగా పండితులు పరిగణిస్తారు. జాతకంలో సూర్య బలం బాగుంటే సమాజంలో తిరుగులేని గుర్తింపు లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో, సూర్య భగవానుడు తన రాశిని లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడల్లా,…. దాని ప్రభావం ద్వాదశ రాశుల వారిపై స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే 2026 జూన్ నెలలో ఒక కీలక ఖగోళ మార్పు జరగబోతోంది.

రాహువు నక్షత్రంలోకి సూర్యుడు
రాహువు నక్షత్రంలోకి సూర్యుడు

ఈ ఏడాది జూన్ 22, 2026న మధ్యాహ్నం 12:31 గంటలకు సూర్యుడు రాహువు ఆధీనంలో ఉండే ‘ఆర్ద్ర నక్షత్రం’ లోకి ప్రవేశించబోతున్నాడు. జూలై 6వ తేదీ వరకు సూర్య దేవుడు ఇదే నక్షత్రంలో కొలువై ఉంటాడు. జ్యోతిష్య శాస్త్ర నమ్మకాల ప్రకారం, రాహువు నక్షత్రంలో సూర్యుని సంచారం వల్ల కొన్ని రాశుల వారికి కెరీర్, వ్యాపారం, ఉద్యోగం ,ఆర్థిక విషయాలలో ఊహించని అద్భుతమైన అవకాశాలు లభించనున్నాయి.

సూర్యుని నక్షత్ర మార్పుతో లాభపడే 4 రాశులు:

  • సింహ రాశి : సూర్యుని ఆర్ద్ర నక్షత్ర ప్రవేశం సింహ రాశి వారికి అమితమైన ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉద్యోగం, వ్యాపార రంగాలలో మీరు వేగంగా ముందుకు సాగడానికి సరికొత్త అవకాశాలు తలుపు తడతాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం లేదా ఉద్యోగం ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ మాటతీరు…. వాక్చాతుర్యం ద్వారా సమాజంలో ప్రజలను ఎంతో ఆకట్టుకుంటారు. దీనివల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలు, ప్రతిష్టలు గణనీయంగా పెరుగుతాయి.
  • కన్యా రాశి : కన్యా రాశి వారు ఈ కాలంలో తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన లేదా మధ్యలో ఆగిపోయిన పనులు క్రమంగా పూర్తి కావడం ప్రారంభిస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో సరికొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్లు దక్కే బలమైన సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా మారి, ధనలాభం కలుగుతుంది. ఈ సమయంలో మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓపిక, సహనాన్ని కోల్పోకుండా ఉండటం మీకు మరింత ప్రయోజనకరంగా మారుతుంది.
  • వృశ్చిక రాశి : ఈ నక్షత్ర సంచారం వృశ్చిక రాశి వారికి పాత కష్టాల నుంచి పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది. చాలా కాలంగా కోర్టు పనులు లేదా ఇతర నిలిచిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆదాయానికి సంబంధించి కొత్త మార్గాలు, ఆర్థిక అవకాశాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణంలో గతంలో ఉన్న గొడవలు సర్దుమణిగి ప్రశాంతత చేకూరుతుంది. బంధుమిత్రులు, జీవిత భాగస్వామితో సంబంధాలలో మాధుర్యం (సన్నిహితం) పెరుగుతుంది.
  • కుంభ రాశి : ఆర్ద్ర నక్షత్రంలోకి సూర్యుని మార్పు కుంభ రాశి వారికి అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీ కెరీర్‌లో సరికొత్త, అద్భుతమైన ఆఫర్లు లభిస్తాయి. కొంతమందికి అయాచితంగా లేదా ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు పడిన కష్టానికి ఇప్పుడు తగిన గుర్తింపు, ప్రతిఫలం దక్కుతాయి. అదే సమయంలో, మానసికంగా మీరు మునుపటి కంటే ఎక్కువ స్థిరత్వాన్ని, సంతోషాన్ని మరియు సమతుల్యతను అనుభవిస్తారు.

‘ఆర్ద్ర నక్షత్రం’ ప్రాధాన్యత…

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe