Swapna Shastra: కలలో డబ్బు కనపడితే శుభమా, అశుభమా? ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయా లేక సంపద పెరుగుతుందా?

Swapna Shastra: కలలో డబ్బు కనపడితే శుభమా, అశుభమా? నిద్రలో మనకు వచ్చే ప్రతి కలకు ఒక పరమార్థం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా కలలో నాణేలు, నోట్లు లేదా డబ్బు దొంగిలించినట్లు అనిపిస్తే.. అది మీ ఆర్థిక భవిష్యత్తు గురించి ఏం చెబుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకోండి. 

Published on: Apr 27, 2026, 16:30:47 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సాధారణంగా మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కలలకు అనేక అర్థాలు కూడా ఉంటాయి. మనకు వచ్చే కలలను బట్టి అది శుభ ఫలితాలను తీసుకు వస్తుందా, అశుభ ఫలితాలను తీసుకు వస్తుందా అనేది తెలుసుకోవచ్చు. చాలా మందికి నిద్రపోయినప్పుడు కలలో డబ్బు కనపడుతూ ఉంటుంది. అది శుభ ఫలితాలను అందిస్తుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Swapna Shastra: కలలో డబ్బు కనపడితే శుభమా, అశుభమా? ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయా లేక సంపద పెరుగుతుందా?
Swapna Shastra: కలలో డబ్బు కనపడితే శుభమా, అశుభమా? ఆర్థిక ఇబ్బందులు మొదలవుతాయా లేక సంపద పెరుగుతుందా?

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో డబ్బు కనపడితే మంచిదా కాదా?

కలలో కాయిన్స్ కనపడితే ఏమవుతుంది?

స్వప్న శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కలలో మీరు పదే పదే రూపాయి కాసులు, కాయిన్స్ వంటివి చూసినట్లయితే అది చాలా శుభప్రదమైన కల అని భావించాలి. ఇలాంటి కలలు వచ్చినట్లయితే ఆర్థిక నష్టం నుంచి త్వరలోనే బయటపడతారని అర్థం. ఇలాంటి కలలు వచ్చినప్పుడు తర్వాత రోజు కొంత డబ్బు ఎవరికైనా దానం చేయడం మంచిది. అలా చేయడం వలన నష్టాలు సంభవించకుండా ఉంటాయని పండితులు చెబుతున్నారు.

కలలో డబ్బు దొంగలించడం:

కలలో దొంగలించిన డబ్బు చూడడం మంచిదా కాదా అనే విషయానికి వస్తే, స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కల వచ్చినట్లయితే త్వరలోనే భారీగా డబ్బులు పొందుతారని అర్థం. లేదా రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుందని దానికి సంకేతం. ఇలాంటి కలలు వచ్చినట్లయితే ఎవరికి చెప్పద్దు, రహస్యంగానే ఉంచాలి.

ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బు తీసుకోవడం:

కలలో ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బు తీసుకున్నట్లు మీకు కనపడినట్లైతే, ఆర్థికపరంగా మీరు ప్రయోజనాలను పొందబోతున్నారని సంకేతం. త్వరలోనే మీరు భారీ మొత్తంలో డబ్బును పొందుతారని ఆ కలకు అర్థం.

చిరిగిపోయిన నోట్లు:

అదే మీ కలలో చిరిగిపోయిన నోట్లు కనిపించినట్లయితే, త్వరలో మీరు చిన్న చిన్న ఆర్థిక సమస్యలతో బాధ పడతారని అర్థం. అలాగే కెరీర్‌లో కూడా హెచ్చుతగ్గులు ఉండచ్చనే ఆ కలకు సంకేతం. ఇలాంటి కల వచ్చినట్లయితే ఎవరికైనా అవసరమైన వారికి డబ్బును విరాళంగా ఇవ్వండి. ఇది మీకు శుభ ఫలితాలను తీసుకువస్తుంది, ఇబ్బందులను తొలగిస్తుంది.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More