...
...
Next Story

దేవాలయాల్లో డబ్బు కంటే ఈ 5 వస్తువులను దానం చేస్తే అనూహ్యమైన పుణ్యఫలం!

సనాతన ధర్మంలో దానధర్మాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే గుడికి వెళ్లినప్పుడు నగదు రూపంలోనే కాకుండా, దీపారాధన నూనె, గోశాలకు గ్రాసం, ఆహార ధాన్యాలు వంటి పవిత్ర వస్తువులను దానం చేయడం ద్వారా ఎలాంటి విశేష ఫలితాలు పొందవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 29, 2026, 12:15:51 IST
Advertisement

చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. వ్రతాలు వంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే దానాలు కూడా చాలా ముఖ్యమైనవి. మనం చేసే దానం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది.

దేవాలయాల్లో డబ్బు కంటే ఈ 5 వస్తువులను దానం చేస్తే అనూహ్యమైన పుణ్యఫలం!
దేవాలయాల్లో డబ్బు కంటే ఈ 5 వస్తువులను దానం చేస్తే అనూహ్యమైన పుణ్యఫలం!

శాస్త్రం ప్రకారం చూస్తే, దానధర్మాలకు అత్యున్నత స్థానం ఉందని చెప్పొచ్చు. దయ, కృతజ్ఞత, ఆధ్యాత్మిక అంకితభావంతో దానం చేయడం వలన అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. దానం మనసును శుద్ధి చేస్తుంది, పుణ్యఫలాలను అందిస్తుంది. చనిపోయిన తర్వాత ఆత్మకు మంచి మార్గాన్ని చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

దానం

భక్తితో చేసిన దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. దానిని భక్తితో దానం చేస్తే సుఖ శాంతులు కలుగుతాయి. శ్రేయస్సు, ఐశ్వర్యాన్ని పొందవచ్చు. అయితే దానం చేసినప్పుడు చాలామంది దేవాలయాలకు కూడా దానాలు చేస్తూ ఉంటారు. డబ్బుతో పాటు దేవాలయాలకు వీటిని దానం చేయడం వలన అద్భుతమైన లాభాలను పొందవచ్చు.

ధనం దానం చేయడం కంటే ఆలయానికి వెళ్లేటప్పుడు ఈ వస్తువులను దానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందట. దేవాలయాల్లో ఈ పవిత్ర వస్తువులను దానం చేయడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.

దీపారాధన కోసం నూనె లేదా నెయ్యి:

దేవాలయంలో నిత్యం దీపారాధన చేస్తారు. దీపం పవిత్ర జ్ఞానానికి, చీకటిపై వెలుగుకు ప్రతీక. ఆలయంలో దీపం కోసం నూనె లేదా నెయ్యిని దానం చేయడం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, ఆవ నూనె వంటివి దానం చేయొచ్చు. ఇవి చాలా మంచి ఫలితాలను అందిస్తాయి. అలాగే ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి, సానుకూలత పెరుగుతుంది.

గోసేవ:

కృష్ణుడు, శివుడు వంటి దేవతలకు గోవుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. గోశాలకు పశుగ్రాసం, పచ్చగడ్డి, ధాన్యం వంటివి దానం చేయడం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఇది అత్యంత పుణ్యకార్యం. గోసేవ ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

సమయం, సేవ:

దేవాలయంలో వస్త్రాలను దానం చేయడం కూడా మంచిదే. వస్త్రాలను దానం చేయడం వలన అహంకారం, ఆడంబర భావాలను తగ్గించుకోవచ్చు. వస్త్రాలను దానం చేయడం వలన చాలా రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

ధాన్యం:

సనాతన ధర్మంలో అన్నదానానికి మించిన దానం లేదు. అన్నదానాన్ని మహాదానం అంటారు. ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని అందిస్తే అద్భుతమైన ఫలితాన్ని చూడొచ్చు. బియ్యం, పప్పులు, ధాన్యాలు వంటి ప్రసాదం తయారీకి ఉపయోగపడే ఆహార పదార్థాలను దానం చేయడం వలన విశేషమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks