మేధావిగా, గొప్ప అర్థశాస్త్రవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా ఆచార్య చాణక్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన అందించిన 'చాణక్య నీతి' మనిషి జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. మానవ సంబంధాలు, స్నేహాలు, శత్రువులు, కుటుంబం మరియు సమాజంలో ఎలా ప్రవర్తించాలనే అంశాలపై ఆయన ఎన్నో అమూల్యమైన సూత్రాలు చెప్పారు.

కుటుంబం తర్వాత జీవితంలో కష్ట సుఖాల్లో తోడుండేది మిత్రుడే అని అందరూ నమ్ముతారు. అయితే, ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మి స్నేహం చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏయే లక్షణాలున్న వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ దూరంగా ఉండాలో ఆయన తన శ్లోకాల ద్వారా స్పష్టంగా వివరించారు.
ముందు పొగడ్తలు.. వెనుక గోతులు
మనిషి జీవితంలో స్నేహితులను ఎంపిక చేసుకునేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలని చాణక్య సూచిస్తున్నారు. ఎవరైతే ముఖం మీద ఎంతో తియ్యగా మాట్లాడుతారో, కానీ మన వెనుక మాత్రం మన పనులను చెడగొట్టడానికి ప్రయత్నిస్తారో అలాంటి వారిని క్షణం కూడా ఆలోచించకుండా వదిలేయాలి.
ఇలాంటి మనుషుల స్వభావాన్ని ఒక విషపు కుండతో పోల్చారు. కుండ పైభాగంలో పాలు ఉన్నప్పటికీ, లోపల మాత్రం ప్రాణాంతకమైన విషం నిండి ఉంటుంది. పైకి కనిపించే మంచితనాన్ని చూసి మోసపోతే, సమయం వచ్చినప్పుడు వారు వెన్నుపోటు పొడిచి మన జీవితాన్ని సర్వనాశనం చేస్తారు. అందువల్ల ఇలాంటి స్వార్థపరులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
నమ్మకద్రోహం చేసే చెడ్డ మిత్రుడు
ఎవరినైనా అతిగా నమ్మి మన రహస్యాలు చెప్పడం చాలాసార్లు ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా చెడ్డ ఆలోచనలు ఉన్న మిత్రుల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఏ చిన్న మనస్పర్థలు వచ్చినా, గొడవలు జరిగినా సరే.. ఇలాంటి మిత్రులు మన జీవితంలోని రహస్యాలన్నింటినీ బయటపెట్టేస్తారు.
{{/usCountry}}ఎవరినైనా అతిగా నమ్మి మన రహస్యాలు చెప్పడం చాలాసార్లు ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా చెడ్డ ఆలోచనలు ఉన్న మిత్రుల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఏ చిన్న మనస్పర్థలు వచ్చినా, గొడవలు జరిగినా సరే.. ఇలాంటి మిత్రులు మన జీవితంలోని రహస్యాలన్నింటినీ బయటపెట్టేస్తారు.
{{/usCountry}}సమాజంలో పరువు తీయడానికి ఏ మాత్రం వెనుకాడరు. ఇది వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన మానసిక ఆందోళనకు, సమస్యలకు దారితీస్తుంది. అందుకే మనసులోని రహస్యాలను అందరితో పంచుకోకూడదని పెద్దలు చెబుతుంటారు.
మూర్ఖులతో స్నేహం అనర్థం
కేవలం మోసగాళ్లే కాకుండా, ఎలాంటి విచక్షణ లేని మూర్ఖులతో స్నేహం చేయడం కూడా ప్రమాదకరమే అని స్పష్టం చేశారు. ఏది మంచి, ఏది చెడు అనే ఇంగితజ్ఞానం లేని వ్యక్తిని ఎవరైతే స్నేహితుడిగా ఎంచుకుంటారో, వారు భవిష్యత్తులో పెద్ద పెద్ద సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మూర్ఖుని ఆలోచనలు ఎప్పుడూ ఇతరులను ఇబ్బందుల్లోకి నెట్టేలాగే ఉంటాయి.
జీవితంలో ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలంటే మనచుట్టూ ఎలాంటి వ్యక్తులు ఉన్నారనేది చాలా ముఖ్యం. చాణక్య చెప్పిన ఈ మార్గాలను పాటిస్తూ, మోసపూరిత వ్యక్తులను ముందుగానే గుర్తించి దూరం పెట్టడం ద్వారా అనవసరమైన మానసిక క్షోభ నుంచి బయటపడవచ్చు.