ఈ 3 రాశుల వారి మాట తీరుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. మీరు ఇందులో ఉన్నారా?
జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం బుధుడు వాక్చాతుర్యం, సంభాషణ, తార్కిక ఆలోచనలకు, శుక్రుడు ఆకర్షణ, అందం, కళా నైపుణ్యాలకు కారకులుగా భావిస్తారు. జాతకంలో ఈ గ్రహాల ప్రభావం బలంగా ఉన్నవారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో, మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారని నమ్మకం.
మనకి మొత్తం 12 రాశులు. రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉన్నాయో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను చెప్పడానికి వీలవుతుంది.

జ్యోతిష్యం ప్రకారం చూసినట్లయితే, బుధ గ్రహాన్ని వాక్చాతుర్యం, సంభాషణ, తార్కిక ఆలోచనలకు కారకుడుగా చెప్తారు. శుక్రుడు ఆకర్షణ, అందం, కళా నైపుణ్యాలను సూచిస్తాడు. వ్యక్తి జీవితంలో ఈ రెండు గ్రహాల ప్రభావం చాలా ముఖ్యమైనది. వ్యక్తి జాతకంలో ఈ రెండు గ్రహాలు బలంగా ఉన్నట్లయితే, వారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. అందరితో సులువుగా కలిసిపోతారు.
ముఖ్యంగా కొన్ని రాశుల వారు గ్రహాల ప్రత్యేక అనుగ్రహంతో అందరితో ఆప్యాయంగా ఉంటారు. వారి మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆ రాశులు ఏవో ఎప్పుడో చూద్దాం. మీరు కూడా ఇందులో ఒకరేమో చూసుకోండి.
ఈ రాశుల వారు మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.. ఎవరైనా వీరితో ఇట్టే కలిసిపోతారు
1.వృషభ రాశి:
వృషభ రాశికి చెందిన వ్యక్తులు మాట తీరు చాలా మధురంగా ఉంటుంది. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడుతారు. ఎదుటివారి మనసును బాధపెట్టరు. వారి అభిప్రాయాలను సహజంగా, స్పష్టంగా సమాజం ముందు ఉంచుతారు. అందుకనే అందరూ వీరి మాటలను ఈజీగా నమ్మేస్తారు. అంతే కాదు, లక్ష్యాల పట్ల నిబద్ధత కలిగి ఉంటారు. ప్రశాంతమైన స్వభావం మరింత ప్రత్యేకతను తీసుకువస్తుంది.
2.మిథున రాశి:
మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. బుధ గ్రహం ప్రభావం వలన మీరు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. తార్కికంగా ఆలోచిస్తారు. వీరి మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అందరితో కలిసి పోతారు. సమాజంలో, కుటుంబంలో వీరికి ప్రత్యేక ఆదరణ లభిస్తుంది.
3.కన్యా రాశి:
ఈ రాశి వారికి కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. కన్యా రాశి వారు బుధ గ్రహ ఆధిపత్యం వలన ఎప్పుడూ కూడా ఆ మాటల్లో స్పష్టత ఉంటుంది. ఎవరినీ బాధ పెట్టకుండా మాట్లాడతారు. సున్నితంగా చెప్పడంలో వీరిది ఎట్టా. సాదాసీదా జీవనశైలి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. అలాగే ఈ రాశి వారి జీవితంలో సానుకూల దృక్పథాన్ని చూస్తారు. వీరి ఆలోచనలు కూడా ఇతరులకు బాగా నచ్చుతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


