హిందూ సంప్రదాయంలో పితృ పక్షానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పవిత్ర దినాలలో ప్రతి ఒక్కరూ తమ పూర్వీకులను భక్తిశ్రద్ధలతో స్మరించుకుంటారు. వారి ఆత్మశాంతి కోసం శ్రాద్ధ, తర్పణ, పిండ ప్రధానం వంటి కార్యక్రమాలను శ్రద్ధగా నిర్వహిస్తారు. అయితే, ఈ సమయంలో కేవలం పూజా కార్యక్రమాలే కాకుండా, ప్రకృతిలోని జీవరాశుల ద్వారా మనకు అందే కొన్ని సంకేతాలు కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పితృ పక్ష సమయాల్లో కొన్ని ప్రత్యేక జీవులు కంటపడితే, దానిని మన పూర్వీకులు మన పట్ల చూపించే ప్రేమకు, వారి అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు.
ఇంటి ముఖద్వారానికి ఆవు రావడం మహా శుభం

పితృ పక్ష వేళ హకస్మాత్తుగా ఏదైనా ఆవు ఇంటి గడప ముందుకు వచ్చి నిలబడితే, దానిని ఎంతో పవిత్రమైన మరియు అదృష్టకరమైన శకునంగా భావిస్తారు. సనాతన ధర్మంలో గోమాతను సాక్షాత్కార దైవంగా కొలుస్తారు. గోమాత శరీరంలో సకల దేవతలతో పాటు మన పితృదేవతలు కూడా నివసిస్తారని ప్రగాఢ విశ్వాసం ఉంది. ఈ సమయంలో ఆవుకు ప్రేమగా రోటీ లేదా పచ్చని గడ్డిని తినిపించడం వల్ల పూర్వీకులు ప్రసన్నులవుతారు. కుటుంబంపై వారి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందని పెద్దలు చెబుతుంటారు.
శ్రాద్ధ కర్మల్లో కాకి పాత్ర - శుభ సూచకం
మన సంప్రదాయంలో శ్రాద్ధ తర్పణాలలో కాకికి అత్యంత ప్రాధాన్యత ఉంది. పితృ పక్షంలో కాకులకు ప్రత్యేకంగా ఆహారాన్ని వడ్డించే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. జ్యోతిష్య, ధార్మిక గ్రంథాల ప్రకారం కాకులను పితృ దేవతల ప్రతిరూపాలుగా పరిగణిస్తారు. ఈ కాలంలో కాకి మీ ఇంటి పైకప్పు మీద, ఆవరణలో లేదా గుమ్మానికి ఎదురుగా వాలిందంటే దానిని మంచి శకునంగా చూడాలి. ఆ సమయంలో ఎలాంటి భయాందోళనకు గురికాకుండా, భక్తితో కాకికి ఆహారం పెట్టడం ద్వారా మన పూర్వీకులకు నేరుగా భోజనం చేరినంత సంతృప్తి కలుగుతుందని నమ్ముతారు.
కుక్కల రాక - పూర్వీకుల ఆప్యాయత
ఇంటి పరిసరాల్లో కుక్కలు కనిపించడం సాధారణమే అయినప్పటికీ, పితృ పక్షంలో వాటి రాకను ప్రత్యేక కోణంలో చూస్తారు. హిందూ పద్ధతిలో కుక్కను యమధర్మరాజుకు మరియు పితృ కర్మలకు సంబంధించిన జంతువుగా చెబుతారు. ఈ ప్రత్యేక దినాలలో ఇంటి దగ్గరికి వచ్చే కుక్కలను తన్ని తగలేయకుండా, వీలైతే కాస్త ఆహారం పెట్టడం మంచిది. పూర్వీకుల ఆశీస్సులు, వారి రక్షణ మనపై ఉందనడానికి ఇది ఒక సంకేతంగా పెద్దలు విశ్వసిస్తారు.
చీమలకు దాణా వేయడం వల్ల కలిగే పుణ్యం
{{/usCountry}}ఇంటి పరిసరాల్లో కుక్కలు కనిపించడం సాధారణమే అయినప్పటికీ, పితృ పక్షంలో వాటి రాకను ప్రత్యేక కోణంలో చూస్తారు. హిందూ పద్ధతిలో కుక్కను యమధర్మరాజుకు మరియు పితృ కర్మలకు సంబంధించిన జంతువుగా చెబుతారు. ఈ ప్రత్యేక దినాలలో ఇంటి దగ్గరికి వచ్చే కుక్కలను తన్ని తగలేయకుండా, వీలైతే కాస్త ఆహారం పెట్టడం మంచిది. పూర్వీకుల ఆశీస్సులు, వారి రక్షణ మనపై ఉందనడానికి ఇది ఒక సంకేతంగా పెద్దలు విశ్వసిస్తారు.
చీమలకు దాణా వేయడం వల్ల కలిగే పుణ్యం
{{/usCountry}}అకస్మాత్తుగా ఇంట్లో భారీ సంఖ్యలో చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తే, దానిని అశుభంగా భావించాల్సిన పనిలేదు. పితృ పక్ష సమయంలో చీమలకు బెల్లం కలిపిన పిండి లేదా నూనె వేయడం అత్యంత పుణ్య కార్యంగా చెబుతారు. చిన్న జీవులకు సేవ చేయడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని, పితృ దోషాల నుంచి క్రమంగా ఉపశమనం లభిస్తుందని నమ్మకం.
పాము కనిపిస్తే భయపడకూడదు
పితృ పక్ష వేళ ఇంట్లో లేదా సమీపంలో పాము కనిపించినప్పుడు చాలా మంది భయపడిపోతుంటారు. అయితే, ధార్మిక నమ్మకాల ప్రకారం దీనిని ప్రతికూలంగా చూడకూడదు. కొన్ని ప్రాంతాలలో పాము కనిపించడాన్ని పూర్వీకుల నుంచి వచ్చే ప్రత్యేక సంకేతంగా భావిస్తారు. అయితే దానిని మనమే స్వయంగా పట్టుకోవడానికి ప్రయత్నించడం లేదా హాని తలపెట్టడం చేయరాదు. ఎవరికైనా ప్రమాదం జరగకుండా నిపుణుల సహాయంతో దానిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం ఉత్తమం.
మొత్తంగా చెప్పాలంటే, పితృ పక్షం అనేది కేవలం పితృ కర్మలను నిర్వర్తించే కాలం మాత్రమే కాదు; సమస్త జీవకోటి పట్ల దయ, కరుణ చూపాల్సిన పవిత్ర సమయం. ఈ చిన్న నిబంధనలను పాటించడం ద్వారా ఇంట్లో సుఖసంతోషాలు, ప్రశాంతత వెల్లివిరుస్తాయి.