...
...
Next Story

శ్రావణమాసంలో ఈ నక్షత్రాల వారికి జాక్‌పాట్.. ప్రమోషన్లు, ధనలాభాలు, కొత్త అవకాశాలు!

శ్రవణ నక్షత్రం వారికి కుటుంబ సంతోషం, వ్యాపార అవకాశాలు, విదేశీ ప్రయాణాలకు అనుకూలత కలగవచ్చు. రోహిణి నక్షత్రం వారికి నిలిచిపోయిన పనులు పూర్తవడంతో పాటు ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కనిపించవచ్చు. ఉత్తర ఫాల్గుణి వారికి ప్రమోషన్, ప్రతిభకు గుర్తింపు, ఉద్యోగంలో పురోగతి లభించే అవకాశాలు ఉన్నాయి.

Published on: Aug 14, 2026, 14:00:47 IST
Advertisement

శ్రావణ మాసం చాలా విశేషమైనది. శ్రావణమాసంలో శివుడిని ఆరాధిస్తే ప్రత్యేక అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం, మంగళవారం నాడు అమ్మవారిని ఆరాధించడం చాలా మంచిది.

శ్రావణమాసంలో ఈ నక్షత్రాల వారికి జాక్‌పాట్.. ప్రమోషన్లు, ధనలాభాలు, కొత్త అవకాశాలు!
శ్రావణమాసంలో ఈ నక్షత్రాల వారికి జాక్‌పాట్.. ప్రమోషన్లు, ధనలాభాలు, కొత్త అవకాశాలు!

శ్రావణ మాసం కొన్ని నక్షత్రాల వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ నక్షత్రాల వారు ఈ శ్రావణ మాసంలో విపరీతమైన లాభాలను పొందుతారు. శ్రావణమాసంలో సూర్యుడి అనుగ్రహంతో పాటుగా ఇతర గ్రహాల అనుకూల సంచారం కారణంగా ఈ నక్షత్రాల వారికి విపరీతమైన అదృష్టం కలగబోతోంది. మరి శ్రావణమాసంలో అదృష్టాన్ని పొందబోతున్న నక్షత్రాలు ఏవి? ఈ నక్షత్రాల్లో మీ నక్షత్రం కూడా ఉందేమో చూసుకోండి.

శ్రవణ నక్షత్రం

శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం వారికి బాగా కలిసి రాబోతుంది. ఈ నక్షత్రానికి అధిపతి వచ్చేసి చంద్రుడు. ఈ నక్షత్రం వారు ఈ శ్రావణ మాసంలో గురువు దృష్టి వలన పురోగతిని చూస్తారు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అవగాహన మరింత పెరుగుతుంది. అనుబంధం బలపడుతుంది.

సొంత వ్యాపారాలను మొదలు పెట్టాలనుకునే వారికి ఇది శుభ సమయం. అలాగే వ్యాపారస్తులు ఈ నెలలో విజయాలను సాధిస్తారు. విదేశాలు వెళ్లాలనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. ఇంటా బయట మీ మాటకు విలువ ఎక్కువగా పెరుగుతుంది. సంతోషం కూడా రెట్టింపు అవుతుంది.

రోహిణి నక్షత్రం

రోహిణి నక్షత్రం వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. రోహిణి నక్షత్రం వారు ఈ శ్రావణమాసంలో శుభ ఫలితాలను పొందుతారు. బాగా కలిసి వస్తుంది. ఈ నెలలో సూర్య, గురు, శని, బుధ గ్రహాల వలన అనుకూలంగా ఉంటుంది.

రోహిణి నక్షత్రానికి అధిపతి గురువు. గురు, శని, బుధ గ్రహాల అనుకూల సంచారం వలన రోహిణి నక్షత్రం వారికి అనేక విధాలుగా కలిసివస్తుంది. ఎప్పటినుంచో పూర్తికాని పనులు అన్నిటిని కూడా ఈ సమయంలో చక్కగా పూర్తి చేస్తారు. అలాగే ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. వ్యాపారస్తులకి కూడా ఇదే శుభ సమయం. భారీగా లాభాలను పొందుతారు.

ఉత్తర ఫాల్గుణి నక్షత్రం

ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇది శుభ సమయం. పరిపాలన విభాగాల్లో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. సమస్యలన్నీ తొలగిపోతాయి.

ధనిష్ట నక్షత్రం

ఈ నక్షత్రం వారికి కూడా శ్రావణమాసం బాగా కలిసి వస్తుంది. ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ నెలలో ఈ నక్షత్రం వారు ఏ పని మొదలుపెట్టినా విజయాలను అందుకుంటారు. ఆదాయ మార్గాలు కూడా విపరీతంగా పెరుగుతాయి.

చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. అన్నదమ్ములతో ఆస్తి వివాదాలు తొలగి సంతోషంగా ఉంటారు. ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనాలకు వెళ్తారు.

అనురాధ నక్షత్రం

ఈ నక్షత్రానికి అధిపతి శని. సంచారం ఎప్పుడూ ఈ నక్షత్రం వారికి స్థిరమైన ఫలితాలను అందిస్తుంది. శనిదేవుడు దయతో ఈ నక్షత్రం వారికి బాగా కలిసి వస్తుంది. విదేశీ అవకాశాలను కూడా పొందుతారు.

ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. ఎప్పటినుంచో పూర్తికాని పనులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. సంతోషంగా ఉంటారు. అన్ని విధాలుగా ఈ నక్షత్రం వారికి ప్రయోజనాలు కలుగుతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks