...
...
Next Story

ఈ 5 రాశుల వారికి నరదృష్టి ఎక్కువగా తగులుతుంది.. కొత్త సంవత్సరం ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది!

మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. 12 రాశుల వారిలో కొన్ని బలాలు, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఒక్కో రాశి వారు మరొకరితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటారు. ఈ రాశుల వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రాశుల వారికి ఎక్కువ నరదృష్టి తగులుతూ ఉంటుంది. కొత్త ఏడాది నరదృష్టి తగలకుండా ఉండాలంటే వీటిని పాటించండి.

Published on: Dec 29, 2025, 16:30:52 IST
Advertisement

రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి భవిష్యత్తు ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడంతో పాటు, ప్రవర్తన తీరు ఎలా ఉంటుందనేది కూడా చెప్పొచ్చు. మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. 12 రాశుల వారిలో కొన్ని బలాలు, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఒక్కో రాశి వారు మరొకరితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటారు.

ఈ రాశుల వారికి నరదృష్టి ఎక్కువగా తగులుతుంది.. జాగ్రత్తగా ఉంటే మంచిది (pinterest)
ఈ రాశుల వారికి నరదృష్టి ఎక్కువగా తగులుతుంది.. జాగ్రత్తగా ఉంటే మంచిది (pinterest)

రాశుల వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రాశుల వారికి ఎక్కువ నరదృష్టి తగులుతూ ఉంటుంది. కొత్త ఏడాది నరదృష్టి తగలకుండా ఉండాలంటే వీటిని పాటించండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారిపై నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. దాంతో అనారోగ్య సమస్యలు, దురదృష్టం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మరి ఎక్కువగా ఏ రాశులకు నరదృష్టి తగులుతుంది? ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశుల వారికి నరదృష్టి ఎక్కువగా తగులుతుంది.. జాగ్రత్తగా ఉంటే మంచిది

1.మిథున రాశి:

మిథున రాశి వారు ఎప్పుడూ చురుకుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఇతరులు వీరిని చూసి అసూయ పడుతుంటారు. ఈ ప్రభావం నుంచి మిథున రాశి వారు తమను తాము రక్షించుకోవాలంటే పసుపు రంగు బ్యాండ్ లేదా గొలుసు వేసుకోవడం మంచిది. అలా చేయడం వలన నరదృష్టి ప్రభావం తగ్గుతుంది.

2.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారు కొత్త సంవత్సరం నరదృష్టి తగలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశి వారు సున్నితమైన స్వభావంతో ఉంటారు. ఈ రాశి వారు ప్రతిదీ కూడా శ్రద్ధగా గమనిస్తారు. ఈ రాశి వారు ముదురు నీలం రంగు వస్తువులను ధరిస్తే చెడు దృష్టి పడకుండా రక్షించుకోవచ్చు. భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచేందుకు కూడా ఇది హెల్ప్ అవుతుంది.

3.సింహ రాశి:

తులా రాశి వారు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ప్రశాంతతతోనే ఉంటారు. ఆకర్షణీయమైన స్వభావం కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారు తమ ప్రవర్తన కారణంగా చెడు దృష్టిని ఎక్కువగా ఎదుర్కొంటారు. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే గులాబీ రంగు బ్యాండ్ వంటి వాటిని ధరించండి. ఇలా చేయడం వలన నరదృష్టి ప్రభావం తగ్గుతుంది.

5.మీన రాశి:

కొత్త సంవత్సరం మీన రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారిపై కూడా చెడు దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికతలో ముందుంటారు. అలాగే ఎవరైనా బాధపడితే, వారి బాధలను తమ బాధలుగా భావించి సహాయం చేస్తారు. ఇతరులు వీరిని చూసి అసూయపడేలా వీరిలో ఉన్న మంచి లక్షణాలు ఉంటాయి. ముదురు ఆకుపచ్చ రంగు ఉంగరాన్ని ధరిస్తే చెడు దృష్టి నుంచి రక్షించుకోవచ్చు. కాబట్టి కొత్త సంవత్సరం ఈ జాగ్రత్తలను తీసుకోండి. ఇవి ఎలాంటి చెడు దృష్టి లేకుండా సంతోషంగా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks