రక్షాబంధన్ లోపు ఈ 5 రాశుల వారికి శని నుంచి బంపర్ ఆఫర్.. రెండు రెట్లు పెరగనున్న అదృష్టం!
2026 రక్షాబంధన్ లోపు శని దేవుడు రేవతి నక్షత్రంలో రెండుసార్లు మార్పు చెందనున్నారు. దీని వల్ల వృషభం, మిథునంతో పాటు మరో మూడు రాశుల వారికి అఖండ ధన లాభం, కెరీర్‌లో ఊహించని పురోగతి లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు..
శని దేవుడిని నవగ్రహాలలో న్యాయమూర్తిగా, కర్మఫల ప్రదాతగా భావిస్తారు. మనం చేసే పనులను బట్టే శని దేవుడు ఫలితాలను ఇస్తుంటాడు. గ్రహాలన్నింటిలోకి శని చాలా నిదానంగా కదులుతాడు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, ఈ ఏడాది రక్షాబంధన్ పండుగ కంటే ముందే శని దేవుడు తన నడకను రెండుసార్లు మార్చుకోబోతున్నాడు. 2026 ఆగస్టు 28న రక్షాబంధన్ వస్తుండగా, అంతకుముందే శని నక్షత్ర సంచారం జరగనుంది.

2026 జూలై 2న శని దేవుడు రేవతి నక్షత్రం రెండో పాదంలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత ఆగస్టు 20న ఇదే రేవతి నక్షత్రం మొదటి పాదంలోకి అడుగుపెడతారు. బుధుడి నక్షత్రమైన రేవతిలో శనిదేవుడి ఈ మార్పు మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. ఈ నక్షత్ర పాద గోచార మార్పు వల్ల ఐదు రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది. ఈ రాశుల వారికి కెరీర్‌లో అద్భుతమైన ఎదుగుదల, అఖండ ధనలాభం, ఆకస్మిక సంతోషాలు కలుగుతాయి అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిత్ నరేంద్ర ఉపాధ్యాయ వివరించారు. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ 5 రాశుల జాతకం మారబోతోంది
1.వృషభ రాశి
శని నక్షత్ర మార్పు వృషభ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల నిరీక్షణ ముగుస్తుంది. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
2.మిథున రాశి
ఈ సమయం మిథున రాశి వారికి అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. శని దేవుడి అనుగ్రహంతో శుభవార్తలు వింటారు. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడంతో పాటు జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం మునుపటి కంటే లాభసాటిగా సాగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
3.కన్యా రాశి
కన్యా రాశి వారి మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. అదృష్టం కలిసి రావడం వల్ల నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆఫీసులో కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది.
4.తులా రాశి
శని దేవుడి కృప వల్ల తులా రాశి వారు కెరీర్‌లో పెద్ద విజయాన్ని సాధిస్తారు. మనసు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతు లభిస్తుంది. మీలో సానుకూల శక్తి పెరుగుతుంది. భౌతిక సుఖాలు, సంపద వృద్ధి చెందుతాయి. ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
5.మకర రాశి
మకర రాశికి అధిపతి స్వయంగా శని దేవుడే. కాబట్టి ఈ నక్షత్ర మార్పు మకర రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పని స్థలంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. భాగస్వామి నుంచి పూర్తి సహకారం అందుతుంది. కుటుంబ వివాదాలు సులభంగా పరిష్కారమవుతాయి.
శని అనుగ్రహం కోసం చేయాల్సిన పరిహారాలు
శని దేవుడి శుభ దృష్టి మీపై ఉండాలంటే శనివారం రోజు శని దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం ఎంతో మంచిది.
శనివారం నాడు ఆవనూనె, నల్ల మినుములు, నల్లటి దుస్తులు, నల్లటి బూట్లు లేదా ఇనుప వస్తువులను దానం చేయాలి.
ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని దోషాల తీవ్రత తగ్గుతుంది.
ప్రతిరోజూ శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల కూడా శని దేవుడు ప్రసన్నుడవుతాడు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య నిపుణుల సూచనలు, నమ్మకాల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. దీనిని పూర్తిగా ధృవీకరించడం లేదు. మరింత సమాచారం కోసం సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


