శ్రీరామనవమి నుంచి ఈ 5 రాశుల వారి ప్రేమ జీవితంలో మాధుర్యం, అదృష్టం, డబ్బు, విలాసాలు!
మార్చి 27న శ్రీరామనవమి. రేపు ఉదయం 5:13కి శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. నవమి తిధి మార్చి 26, 27 కూడా వుంది. కొన్ని చోట్ల రేపు, మరి కొన్ని చోట్ల 27న జరుపుతున్నారు. శుక్రుడు డబ్బు, ఆనందం, విలాసాలు, ప్రేమ మొదలైన వాటికి కారకుడు. శుక్ర సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశులను కూడా ప్రభావితం చేస్తుంది.
గ్రహాలు కాలాన్ని గుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల్ని ప్రభావితం చేస్తుంది. మార్చి 27న శ్రీరామనవమి. రేపు ఉదయం 5:13కి శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. నవమి తిధి మార్చి 26, 27 కూడా వుంది. కొన్ని చోట్ల రేపు, మరి కొన్ని చోట్ల 27న జరుపుతున్నారు. శుక్రుడు డబ్బు, ఆనందం, విలాసాలు, ప్రేమ మొదలైన వాటికి కారకుడు. శుక్ర సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశులను కూడా ప్రభావితం చేస్తుంది.

శుక్ర సంచారంలో మార్పు వస్తే కొన్ని సార్లు శుభ ఫలితాలు కలుగుతాయి, కొన్ని సార్లు అశుభ ఫలితాలు కలుగుతాయి. శ్రీరామనవమి నుంచి ఈ రాశుల వారికి చాలా బాగుంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. ప్రేమ జీవితంలో మధురం పెరుగుతుంది. కెరియర్లో కూడా మంచి మార్పులను చూస్తారు. మరి శ్రీరామనవమి నుంచి ఏ రాశి వారి అదృష్టం పెరుగుతుంది, ప్రేమ జీవితంలో మాధుర్యం ఉంటుందో తెలుసుకుందాం.
శ్రీరామనవమి నుంచి ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు.. అదృష్టం, ప్రేమ జీవితంలో మధురం
1.మేషరాశి
మేష రాశి వారికి శుక్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితం మరింత మధురంగా మారుతుంది. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. తెలుపు వస్త్రాలను ధరించి లక్ష్మీదేవిని ఆరాధిస్తే మరింత శుభ ఫలితాలను పొందవచ్చు.
2.సింహ రాశి
సింహ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న టాస్కులను పూర్తి చేస్తారు. కెరియర్లో మంచి మార్పులు వస్తాయి. విజయాలను అందుకుంటారు. విద్యార్థులకు కూడా ఇది శుభ సమయం. సానుకూల మార్పులను చూస్తారు. ప్రేమ జీవితంలో ఆనందం పెరుగుతుంది. విష్ణువును ఆరాధించి పసుపు రంగులో ఉండే పండ్లను దానం చేయడం వలన మంచి ఫలితాలు కనపడతాయి.
3.మిథున రాశి
మిథున రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. స్నేహితుల మద్దతు ఉంటుంది. ప్రేమ జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది. శ్రీ సూక్తాన్ని చదువుకుని, తెలుపు రంగులో ఉండే స్వీట్లు దానం చేయడం వలన మంచి ఫలితాలను చూస్తారు.
4.ధనస్సు రాశి
ఈ రాశి వారి ప్రేమ జీవితం ఆనందంగా మారుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. సంతోషం రెట్టింపు అవుతుంది. కెరియర్లో మంచి మార్పులను చూస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఇది శుభ సమయం. ఆవుకు గడ్డి వేస్తే శుభ ఫలితాలను చూస్తారు.
5.కుంభరాశి
కుంభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సోదరులు, స్నేహితుల సపోర్ట్ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చిన్న ట్రిప్పులు వేస్తారు. చిన్నపిల్లలకు తెలుపు రంగులో ఉండే స్వీట్లు పంచి పెడితే బాగా కలిసి వస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


