ఇంటి గోడకు వేలాడదీసే ఈ 6 వస్తువులు వాస్తు దోషాలను కలుగజేస్తాయ్, వాటికి పరిహారాలు!

వాస్తు ప్రకారం ఇంటి గోడలకు కొన్ని వస్తువులను వేలాడదీయడం అశుభంగా పరిగణిస్తారు. కింద చెప్పే 6 రకాల వస్తువులను గోడకు వేలాడదీయడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయని, ఇది కుటుంబ పురోగతిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నమ్ముతారు.

Published on: Jun 13, 2026, 11:23:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వాస్తు శాస్త్రం ప్రకారం తెలిసి తెలియక ఇంటి గోడలకు వేలాడదీసిన కొన్ని తప్పుడు వస్తువులు క్రమంగా ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి. అంతేకాకుండా ఈ వస్తువులు వాస్తు దోషానికి ప్రధాన కారణం కావచ్చు. మన ఇంటి గోడలను అందంగా, ఆకర్షణీయంగా చేయడానికి మనం తరచుగా అనేక రకాల వస్తువులను వాటిపై పెడతాం. కానీ వాస్తు ప్రకారం గోడలకు కొన్ని వస్తువులను వేలాడదీయడం అస్సలు అశుభం. ఎందుకంటే కలహాలు, ప్రతికూలత, మానసిక ఒత్తిడి, సంబంధాలలో దూరాన్ని కలిగిస్తాయి.

ఇంటి గోడకు పెట్టకూడని వస్తువులు
ఇంటి గోడకు పెట్టకూడని వస్తువులు

గోడ గడియారం

మీ ఇంట్లోని ఏ గదిలోనైనా గోడకు విరిగిన లేదా పాడైపోయిన గోడ గడియారం వేలాడుతుంటే, దానిని వెంటనే తీసివేయండి. వాస్తు ప్రకారం ఇది అశుభంగా చెబుతారు. ఆగిపోయిన గోడ గడియారం కుటుంబ సభ్యుల అదృష్టానికి, పురోగతికి ఆటంకం కలిగిస్తుందని నమ్ముతారు.

ఆగిపోయిన గడియారాన్ని వెంటనే బాగు చేయించండి, ఒకవేళ అది పాడైపోయి ఉంటే, దాని స్థానంలో కొత్తదాన్ని పెట్టండి. ఎల్లప్పుడూ పనిచేస్తూ, సరైన సమయాన్ని చూపిస్తూ, శుభ్రంగా ఉన్న గడియారాన్ని మాత్రమే గోడకు తగిలించాలి.

పగిలిన గాజు

వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇంట్లో పగిలిన గాజు ముక్కలను ఉంచడం అశుభంగా చెబుతారు. పగిలిన గాజు తీవ్రమైన వాస్తు దోషాలను కలిగిస్తుంది. ఒకవేర అద్దం పగిలినా.. గోడకు అలాగే ఉండకూడనీయదు. దీని దుష్ప్రభావాలు సంబంధాలలో, పరిసరాలలో ఒత్తిడికి దారితీయవచ్చు.

గోడ అద్దం లేదా ఫోటో ఫ్రేమ్ పగిలిపోతే, దానిని వెంటనే ఇంటి నుండి తీసివేయండి. అద్దాన్ని మరమ్మత్తు చేయించకుండా, దాని స్థానంలో కొత్తదాన్ని అమర్చాలి.

గోడకు పువ్వు

చాలా మంది తమ ఇళ్ల గోడలకు పువ్వులు తగిలిస్తారు లేదా తమ పూర్వీకుల ఛాయాచిత్రాల చుట్టూ పూలమాలలు వేస్తారు. గుర్తుంచుకోవలసిన ఒక విషయం ఏమిటంటే పాత, ఎండిపోయిన లేదా వాడిపోయిన పువ్వులను గోడలకు ఎప్పుడూ తగిలించకూడదు. ఇవి ఇంట్లో అనారోగ్యానికి, విచారానికి కారణం కావచ్చు. వాడిపోతే తీసివేయాలి.

గోడపై ఉన్న ఎండిపోయిన, వాడిపోయిన పువ్వులను తీసివేసి, వాటిని పారుతున్న నీటిలో లేదా మట్టిలో పాతిపెట్టండి. ఇంట్లో ఎల్లప్పుడూ తాజా పువ్వులు లేదా పచ్చని మొక్కలను ఉంచండి.

గోడపై చిత్రాలు

ఇళ్ల గోడలను అందంగా తీర్చిదిద్దడానికి రకరకాల చిత్రాలను పెడతాం. అయితే ఇంటిలోని గోడపైనా కొన్ని రకాల చిత్రాలను పెట్టకూడదు. ఏడుస్తున్న పిల్లవాడు, మునిగిపోతున్న పడవ, లేదా పోట్లాడుకుంటున్న జంతువుల చిత్రాలను పెట్టకూడదు. ఇలాంటి ప్రతికూల చిత్రాలు మానసిక ఒత్తిడికి కారణమవుతాయి.

మీ ఇంట్లో ఈ ప్రతికూల చిత్రాలలో ఏవైనా ఉంటే, వాటిని తీసివేయండి. వాటి స్థానంలో ఎగిరే తెల్లని హంసలు లేదా నవ్వుతున్న ముఖాల వంటి సానుకూల చిత్రాలను పెట్టండి.

చిరిగిన క్యాలెండర్లు

వాస్తు శాస్త్రం ప్రకారం, పాత లేదా చిరిగిన క్యాలెండర్లను ఇంటి గోడలకు వేలాడదీయకూడదు. అటువంటి క్యాలెండర్లు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తికాకుండా అడ్డుకుని, ఆటంకాలను సృష్టిస్తాయి. దీనివల్ల కుటుంబంలో మానసిక ఒత్తిడి కూడా కలగవచ్చు.

గోడపై ఉన్న గత సంవత్సరం లేదా నెల క్యాలెండర్‌ను తీసివేయండి. దాని స్థానంలో, ఎల్లప్పుడూ ఉత్తరం లేదా తూర్పు వైపుకు తిరిగి ఉండే కొత్త క్యాలెండర్‌ను పెట్టండి.

ముళ్ల మెుక్కలు

చాలా మంది తమ ఇళ్లలో ముళ్ల మొక్కల చిత్రాలను తగిలిస్తారు. కానీ ఇంట్లో ముళ్ల మొక్కలను ఉంచడం ఎలాగైతే అశుభంగా భావిస్తారో, అలాగే ముళ్ల మొక్కల చిత్రాలను కూడా గోడలకు తగిలించకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లో ఆందోళన, చిరాకు పెరుగుతాయి.

అలాంటి చిత్రాలకు బదులుగా మీ ఇంటి గోడలకు వికసిస్తున్న పువ్వుల చిత్రాలను తగిలించండి. ఇవి మనసుకు ప్రశాంతతను, కళ్లకు ఆహ్లాదాన్ని అందించి, తద్వారా ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కొనసాగిస్తాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More