ఇల్లు శుభ్రంగా ఉంటే అందంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ సానుకూల శక్తికి అది మూల కారణం. ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని, సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుందని నమ్మకం. సానుకూల శక్తిని పెంచుకోవడానికి ఇంట్లో ఈ సులువైన చిట్కాలను పాటించండి. ఇక మొత్తం మీ దశ తిరిగిపోతుంది.

జ్యోతిష్య పండితులు చెబుతున్నదాని ప్రకారం ఇలా చేస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరిగి, మనసు తేలికగా అనిపిస్తుంది. సానుకూల శక్తి పెరగాలంటే ఇంట్లో ఈ చిన్న చిన్న మార్పులు చేయండి. ఆర్థికపరంగా ఎన్నో ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
పగిలిన అద్దాలు ఇంట్లో ఉంచొద్దు
ఇంట్లో పగిలిన అద్దాలను ఉంచకండి. కుటుంబ సంబంధాల్లో విభేదాలు ఎక్కువగా ఉండటం, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఈ తప్పు అసలు చేయొద్దు. ఉపయోగం లేని వస్తువులు, పగిలిపోయిన వస్తువులను ఇంట్లో నుంచి తొలగించాలి. ముఖ్యంగా పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచవద్దు. ఇవి ప్రతికూల శక్తికి కారణమవుతాయని నమ్మకం. వాటిని ఇంటి నుంచి తొలగిస్తేనే మంచిది. ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
ఉప్పు కింద పడితే...
భారతీయ సంస్కృతిలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పొరపాటున ఉప్పు నేలపై పడితే, దానిని కాళ్లతో తొక్కడం వంటివి చేయకూడదు. శుభ్రమైన గుడ్డ లేదా చీపురుతో జాగ్రత్తగా దానిని తొలగించాలి. ఉప్పును అగౌరవపరచడం వల్ల అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయని, ఇబ్బందులు కూడా ఎక్కువ అవుతాయని నమ్మకం. ఇది ఒక సాంస్కృతిక విశ్వాసం.
ప్రధాన ద్వారం
ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ప్రవేశ ద్వారం సరిగ్గా లేకపోతే సానుకూల శక్తి ఇంట్లోకి రాదని విశ్వసిస్తారు. జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు లేవని అనిపిస్తే ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ శుభ్రంగా, అందంగా ఉంచండి. పరిశుభ్రమైన ప్రవేశ ద్వారం ఇంటి వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఇంటికి వచ్చే వారిపై కూడా మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది.
భోజనం చేసే సమయంలో ఈ తప్పులు చేయొద్దు
{{/usCountry}}ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ప్రవేశ ద్వారం సరిగ్గా లేకపోతే సానుకూల శక్తి ఇంట్లోకి రాదని విశ్వసిస్తారు. జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు లేవని అనిపిస్తే ప్రధాన ద్వారాన్ని ఎప్పుడూ శుభ్రంగా, అందంగా ఉంచండి. పరిశుభ్రమైన ప్రవేశ ద్వారం ఇంటి వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఇంటికి వచ్చే వారిపై కూడా మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది.
భోజనం చేసే సమయంలో ఈ తప్పులు చేయొద్దు
{{/usCountry}}భోజనం చేసేటప్పుడు కుటుంబ సభ్యులు ఆనందంగా తినాలి. ఈ సమయంలో ఫిర్యాదులు చేయడం, వాదనలు పెట్టుకోవడం వంటివి చేయకూడదు. అవి ప్రతికూల శక్తికి కారణమవుతాయని నమ్మకం. అలాగే ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. భోజనం చేసేటప్పుడు సానుకూల సంభాషణలు, కృతజ్ఞతా భావంతో ఉండాలి. అప్పుడే ఆనందం, ప్రశాంతత పెరుగుతాయి. పరస్పర ప్రేమాభిమానాలు కూడా ఏర్పడతాయి.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.