చాలామంది ఇంట్లో రకరకాల సమస్యలు ఉంటాయి. ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే కచ్చితంగా ఇది మీరు తెలుసుకోవాలి.

ప్రతి ఒక్కరూ కూడా కుటుంబం సంతోషంగా ఉండాలని, ఐశ్వర్యంతో తులతూగాలని, ఆర్థిక పరిస్థితి బాగుండాలని అనుకుంటారు. మారుతున్న కాలంలో ఖర్చులు పెరుగుతున్నాయి. ఊహించని ఆర్థిక సవాళ్ల కారణంగా చాలామందికి పొదుపు చేయడం కూడా కష్టంగా మారుతుంది. అటువంటి పరిస్థితుల్లో కష్టపడి సంపాదించిన డబ్బు కూడా వృథా కాకుండా ఉండాలంటే కొన్ని వాస్తు నియమాలను పాటించాలి.
ఈ వాస్తు నియమాలను పాటించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక అసమతుల్యతకు ఈ చిన్న చిన్న లోపాలే కారణాలు అవ్వచ్చు. కాబట్టి వీటిని తెలుసుకుని పాటించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. లక్ష్మీదేవి కూడా ఆ ఇంట కొలువై ఉంటుంది.
సరైన దిశలో బీరువా లేదా లాకర్
మనం డబ్బులు దాచుకునే చోటు సరైన దిశలో ఉండాలి. వాస్తు ప్రకారం డబ్బును పెట్టే చోటు సరిగా ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నగలు, బంగారం, ముఖ్యమైన పత్రాలు వంటివి చాలామంది బీరువాలో లేదా లాకర్లలో పెడుతూ ఉంటారు. అయితే బీరువాలు, లాకర్లను ఉత్తర దిశలో పెడితే మంచిది. ఉత్తర దిశ కుబేరుడి దిశ. ఆ దిశలో ఇవి ఉన్నట్లయితే ఆర్థిక స్థిరత్వం పెరగడంతో పాటు లక్ష్మీదేవి కూడా తాండవిస్తుంది.
కుళాయిల నుంచి నీరు లీక్ అవ్వకూడదు
కుళాయిల నుంచి నీరు బయటకు లీక్ అవ్వకూడదు. ఒకవేళ అలా మీ ఇంట్లో జరుగుతున్నట్లయితే ఆ కుళాయిని రిపేర్ చేయించండి. వాస్తు నమ్మకాల ప్రకారం అలా నీరు వృథాగా పోతున్నట్లయితే ఆ ఇంట్లో సంపద కరిగిపోతుంది. అనవసరమైన ఖర్చుల రూపంలో డబ్బు అంతా కూడా పోతుందని గుర్తు పెట్టుకోండి. కాబట్టి నీటిని వృథా చేయొద్దు. అప్పుడే డబ్బు మీ ఇంట్లో ఉంటుంది.
నీరు వెళ్లే దారి
ఇంట్లో ఉపయోగించిన నీరు బయటకు వెళ్లే దిశ కూడా ముఖ్యమే. ఇంట్లో మురికినీరు లేదా వాడిన నీరు దక్షిణం లేదా ఉత్తర దిశల వైపుగా బయటకు వెళ్లడం మంచిదని చెబుతున్నారు. నీరు సరైన దిశలో ప్రవహిస్తే సానుకూల శక్తి మీ ఇంట్లో ప్రవహిస్తుంది. దాంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు.
ఈ పొరపాట్లు కూడా జరగకుండా చూసుకోవాలి
{{/usCountry}}ఇంట్లో ఉపయోగించిన నీరు బయటకు వెళ్లే దిశ కూడా ముఖ్యమే. ఇంట్లో మురికినీరు లేదా వాడిన నీరు దక్షిణం లేదా ఉత్తర దిశల వైపుగా బయటకు వెళ్లడం మంచిదని చెబుతున్నారు. నీరు సరైన దిశలో ప్రవహిస్తే సానుకూల శక్తి మీ ఇంట్లో ప్రవహిస్తుంది. దాంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు.
ఈ పొరపాట్లు కూడా జరగకుండా చూసుకోవాలి
{{/usCountry}}ఇంట్లో పగిలిన అద్దాలు, విరిగిపోయిన సామాన్లు, పనికిరాని వస్తువులు ఉండకూడదు. ఇవి ఇంట్లో పేరుకుపోతే ప్రతికూల శక్తి పెరుగుతుంది. సానుకూల శక్తి దూరం అవుతుంది. కాబట్టి ఈ పొరపాట్లు కూడా చేయకండి.
ఇంట్లో ఒక మంగళ కలశాన్ని స్థాపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఐశ్వర్యాన్ని కూడా ఇది తీసుకొస్తుంది. ఈ చిన్న చిన్న మార్పులు మీ ఇంట్లో చేస్తే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. సంపద పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.