...
...
Next Story

18 రోజులు పాటు బుధుడు తిరోగమనం.. ఈ రాశుల వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది.. డబ్బు, ఉద్యోగాలతో పాటు ఎన్నో!

బుధుడు నవంబర్ 10 నుంచి తిరుగమనంలో ఉన్నాడు. నవంబర్ 29 మధ్యాహ్నం 11 గంటలకు బుధుడు నేరుగా సంచారం చేస్తాడు. ఈ 18 రోజులు కూడా 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. బుధుడు ఈ పద్దెనిమిది రోజులు తిరోగమనంలో ఉండడంతో కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ 18 రోజులు ఈ రాశుల వారి జీవితమే మారిపోతుంది.

Published on: Nov 13, 2025, 10:00:11 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు ఏర్పడడం సహజం. అయితే ఒకసారి గ్రహాల మార్పు వలన ద్వాదశ రాశుల వారి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. కొన్ని సార్లు ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. బుధుడు నవంబర్ 10 నుంచి తిరుగమనంలో ఉన్నాడు. నవంబర్ 29 మధ్యాహ్నం 11 గంటలకు బుధుడు నేరుగా సంచారం చేస్తాడు. అయితే ఈ 18 రోజులు కూడా ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి.

18 రోజులు పాటు బుధుడు తిరోగమనం.. ఈ రాశులకు అనేక లాభాలు
18 రోజులు పాటు బుధుడు తిరోగమనం.. ఈ రాశులకు అనేక లాభాలు

బుధుడు ఈ పద్దెనిమిది రోజులు తిరోగమనంలో ఉండడంతో కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ 18 రోజులు ఈ రాశుల వారి జీవితమే మారిపోతుంది. ఆర్థికపరంగా సమస్యలు ఉండవు, లాభాలను పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది? ఎవరు ఇలాంటి లాభాలను పొందవచ్చు? ఇప్పుడు తెలుసుకుందాం.

18 రోజులు పాటు బుధుడు తిరోగమనం.. ఈ రాశులకు అనేక లాభాలు

1.మకర రాశి

మకర రాశి వారికి బుధుడు తిరోగమనం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి కెరీర్‌లో అనేక మార్పులు ఉంటాయి, లాభాలను పొందుతారు. ఉన్నతాధికారుల నుంచి సపోర్ట్ ఉంటుంది. ఉద్యోగులు విశేషమైన లాభాలను పొందుతారు. ఈ రాశి వారు ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంటారు.

2.కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ 18 రోజులు బాగా కలిసి వస్తాయి. ఎక్కువ లాభాలను పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సీనియర్ల సపోర్ట్ ఉంటుంది. అపార్థాలు తొలగిపోతాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. పరిశోధన రంగం వారికి ఇది బాగా కలిసి వస్తుంది. సాంకేతికపరమైన వృత్తులు ఎంచుకున్న వారు కూడా మంచి లాభాలను పొందుతారు.

3.మిథున రాశి

వృషభ రాశి వారికి బుధుడు తిరోగమనం బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఆర్థిక లాభాలను పొందుతారు. అహంకారాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్తే అన్ని బాగా కలిసి వస్తాయి. ఆర్థికపరంగా సమస్యలు ఉండవు, లాభాలను పొందుతారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks