...
...
Next Story

ఈ రాశుల వారికి వెండి కలిసి రాదు.. పొరపాటున కూడా ధరించకండి!

జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. అయితే గ్రహాల ప్రభావాన్ని బట్టి మనం ఏ రాశి వారికి ఏ లోహం కలిసి వస్తుంది, ఎవరు ఎలాంటి లోహాలను ధరించవచ్చు, ఎవరు ఎలాంటి లోహాలను ధరించకూడదు అనే విషయాన్ని చెప్పొచ్చు. ఈ రాశుల వారికి వెండి కలిసి రాదు.

Published on: Dec 12, 2025, 15:00:10 IST
Advertisement

రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, వ్యక్తిత్వం ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా చెప్పచ్చు. జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి కూడా ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. అయితే గ్రహాల ప్రభావాన్ని బట్టి మనం ఏ రాశి వారికి ఏ లోహం కలిసి వస్తుంది, ఎవరు ఎలాంటి లోహాలను ధరించవచ్చు, ఎవరు ఎలాంటి లోహాలను ధరించకూడదు అనే విషయాన్ని చెప్పొచ్చు.

ఈ రాశుల వారికి వెండి కలిసి రాదు.. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాలి (pinterest)
ఈ రాశుల వారికి వెండి కలిసి రాదు.. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాలి (pinterest)

బంగారం గురువుకి చెందినది. వెండి చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే ఇనుము శనికి సంబంధించినది. ఇలా గ్రహాలకు లోహాలతో సంబంధం ఉంటుంది. ఇక వెండి అయితే చంద్రుడికి సంబంధించినది. వెండిని ధరించేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. కొన్ని రాశుల వారికి వెండి కలిసి రాదు. ఏ రాశుల వారికి వెండి కలిసి రాదు? ఎవరు ధరించకూడదో చూసేద్దాం.

ఈ రాశుల వారికి వెండి కలిసి రాదు.. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాలి

1.మేష రాశి

మేష రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారు వెండిని ధరించడం వలన చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కుజుడికి చంద్రుడికి భిన్న స్వభావాలు కలిగి ఉండడంతో శక్తి అసమతుల్యంగా మారుతుంది. దీంతో ఈ రాశి వారు వెండిని ధరిస్తే ఆర్థిక నష్టాలు, మానసిక అశాంతి, ఆదాయ వనరులు తగ్గిపోవడం వంటివి చూడొచ్చు. కాబట్టి ఈ రాశి వారు వెండిని ధరించకపోవడమే మంచిది.

2.ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి వెండి ధరించడం వలన పెద్దగా కలిసి రాదు. ధనుస్సు రాశికి అధిపతి గురువు. గురు గ్రహం బంగారంతో అనుసంధానాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి బంగారం బాగా కలిసి వస్తుంది. వెండి చంద్రుడి లోహం కనుక ఈ రాశి వారు వెండి ధరిస్తే ఏకాగ్రత తగ్గిపోవడం, శారీరక–మానసిక అలసట, ఉద్యోగ, వ్యాపారాల్లో నష్టాలు వంటివి చూస్తారు. ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది.

3.సింహ రాశి

మీన రాశికి అధిపతి గురువు. మీన రాశి వారు కూడా వెండిని ధరించకపోవడమే మంచిది. మానసిక అలసట, విద్య, ఉద్యోగంలో ఇబ్బందులు, భావోద్వేగ సమస్యలు, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం వంటి ఫలితాలు చూడొచ్చు. కాబట్టి ఈ రాశి వారు కూడా వెండికి దూరంగా ఉండటమే మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks