ఈ రాశుల అమ్మాయిలు లక్ష్మీదేవులతో సమానం.. వీరు ఉన్న చోట డబ్బు ప్రవహిస్తుంది!

ఈ రాశుల అమ్మాయిలు లక్ష్మీదేవితో సమానంగా పరిగణించబడతారు. ఈ రాశుల అమ్మాయిలు ఎక్కడ ఉంటారో అక్కడ అన్నీ బాగా కలిసి వస్తాయి. భర్త కెరీర్‌లో కూడా అనేక మార్పులు వస్తాయి. భర్త జీవితంలో కూడా సక్సెస్ ఉంటుంది. భర్త కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటారు. మరి ఆ రాశుల వారు ఎవరో చూద్దాం. ఈ రాశులలో మీరూ ఒకరేమో చూసుకోండి.

Published on: Jan 28, 2026, 13:30:45 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను చెప్పవచ్చు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూసినట్లయితే, ఈ రాశుల అమ్మాయిలు లక్ష్మీదేవితో సమానంగా పరిగణించబడతారు.

ఈ రాశుల అమ్మాయిలు లక్ష్మీదేవులతో సమానం
ఈ రాశుల అమ్మాయిలు లక్ష్మీదేవులతో సమానం

ఈ రాశుల అమ్మాయిలు ఎక్కడ ఉంటారో అక్కడ అన్నీ బాగా కలిసి వస్తాయి. భర్త కెరీర్‌లో కూడా అనేక మార్పులు వస్తాయి. భర్త జీవితంలో కూడా సక్సెస్ ఉంటుంది. భర్త కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటారు. మరి ఆ రాశుల వారు ఎవరో చూద్దాం. ఈ రాశులలో మీరూ ఒకరేమో చూసుకోండి.

ఈ రాశుల అమ్మాయిలు లక్ష్మీదేవులతో సమానం.. వీరు ఉన్న చోట డబ్బు ప్రవహిస్తుంది

వృషభ రాశి

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి అమ్మాయిలు ఎక్కువ సహనంతో ఉంటారు. అలాగే అన్నిటినీ మేనేజ్ చేసుకునే నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే భర్తకు అదృష్టాన్ని తీసుకొస్తారు. శుక్రుడి ప్రభావంతో ఈ రాశి అమ్మాయిలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే వీరు ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు ప్రవహిస్తుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి అమ్మాయిలు కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి అమ్మాయిలు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది. భర్త జీవితంలో కూడా సక్సెస్ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. అలాగే మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. ఈ రాశి అమ్మాయిలు ఉన్న ఇంట్లో అత్తమామలు కూడా అదృష్టవంతులే. వీరు ఉన్నచోట సంపద పెరుగుతుంది. పని ప్రదేశంలో కూడా అందరికీ అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి అమ్మాయిలు చాలా తెలివైనవారు. అలాగే ఈ రాశి అమ్మాయిలు భర్తకు సరైన నిర్ణయాలు తీసుకునేలా సహాయం చేస్తారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది. భర్త కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటారు. వారికి సహాయం చేసి ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More