Today Horoscope: ఈరోజు వారికి విపరీతమైన అదృష్టం, ప్రమోషన్లతో పాటు వ్యాపారంలో లాభాలు, శుభవార్తలు!
Today Horoscope: మే 20, బుధవారం నాటి ద్వాదశ రాశి ఫలాలు ఇక్కడ ఉన్నాయి. వినాయకుడి ఆశీస్సులతో ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుంది? ఎవరికి ఇబ్బందులు ఎదురవుతాయి? మేషం నుంచి మీనం వరకు మీ భవిష్యత్తు ఎలా ఉందో ఇప్పుడే తెలుసుకోండి. ఈరోజు వారికి విపరీతమైన అదృష్టం, ప్రమోషన్లతో పాటు వ్యాపారంలో లాభాలు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు, నక్షత్రాల స్థితి ఆధారంగా మన రోజువారీ భవిష్యత్తు మారుతూ ఉంటుంది. 2026, మే 20వ తేదీ బుధవారం నాడు ఏయే రాశుల వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బుధవారం అంటేనే విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ విఘ్ననాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల విఘ్నాలు తొలగిపోయి, చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతుంటారు. బుధ గ్రహ దోషాలు ఉన్నవారు కూడా ఈ రోజు గణపతిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.

ద్వాదశ రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి
మేష రాశి
ఈరోజు మీకు కొంచెం హడావిడిగా గడుస్తుంది. ఉదయం నుంచే పనుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆఫీసులో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలనే ఆందోళన కలగవచ్చు. అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త ఓపికగా ఉండండి. సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ఊపందుకుంటాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
మిథున రాశి
ఈ రోజు మీరు చిన్న చిన్న విషయాలకే చిరాకు పడే అవకాశం ఉంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ పనిపై ఏకాగ్రత వహించాలి. స్నేహితుల నుంచి వచ్చే సలహాలు మీకు ఏదో ఒక రూపంలో సహాయపడతాయి. కార్యాలయంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సాయంత్రం నడక లేదా ధ్యానం చేయండి.
కర్కాటక రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. అటు వృత్తి జీవితాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో కాస్త కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. బయటి ఆహారం తినడం తగ్గించడం మంచిది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, కానీ అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి.
సింహ రాశి
మీలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంది. పాత సమస్యల నుంచి ఉపశమనం లభించడంతో మనసు తేలికపడుతుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి కలిసి వచ్చే రోజు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. ప్రేమికుల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కన్యా రాశి
కన్యా రాశి వారికి బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆఫీసులో పనిభారం వల్ల అలసటగా అనిపించవచ్చు. ఇతరులతో అనవసర వాదనలకు దిగవద్దు, ఇది మీ సమయాన్ని వృధా చేస్తుంది. ఆర్థికంగా కొంత ఇబ్బంది అనిపించినా, కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని గుర్తుంచుకోండి.
తులా రాశి
తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. సన్నిహితుల నుంచి మీకు ఆర్థిక సహాయం అందవచ్చు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు. ముఖ్యంగా వెన్నునొప్పి లేదా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రోజువారీ పనుల్లో క్రమశిక్షణ పాటించండి.
వృశ్చిక రాశి
కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది. వృత్తి జీవితంలో ఎదుగుదల కనిపిస్తోంది. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లే ప్లాన్ చేస్తారు. గతంలో కంటే మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి ఈ రోజు ఎంతో ఊరటనిస్తుంది. చాలా కాలంగా రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, ఇది మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
మకర రాశి
ఈ రోజు మీ మనసు కాస్త ఆందోళనగా ఉండే అవకాశం ఉంది. కష్టానికి తగిన ఫలితం వెంటనే రాకపోవడంతో నిరాశ చెందవచ్చు. ఇతరుల మాటలను ఎక్కువగా పట్టించుకోకండి. ధన లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరికీ హామీలు ఇవ్వకండి. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో సమస్యల నుంచి గట్టెక్కుతారు.
కుంభ రాశి
అదృష్టం మీ వైపు ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపారంలో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు వినాలనుకుంటున్న శుభవార్త ఈ రోజు అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు.
మీన రాశి
మీ ఆలోచనల్లో స్పష్టత లోపించవచ్చు. ముఖ్యమైన పనులపై దృష్టి సారించడం కష్టమవుతుంది. కుటుంబంతో సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఖర్చులు మీ బడ్జెట్‌ను మించిపోయే ప్రమాదం ఉంది. ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉండవద్దు, తగిన విశ్రాంతి తీసుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


