శనివారం రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారికి అదృష్టం కలిసొచ్చే అవకాశం!

శనివారం గ్రహాల గమనం ప్రభావంతో 12 రాశుల వారికి భిన్నమైన ఫలితాలు ఉండనున్నాయి. మేష రాశి వారు శారీరక అలసట, మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉండగా, వృషభ రాశి వారికి భావోద్వేగంగా ఉపశమనం లభిస్తుంది. 

Published on: Aug 22, 2026, 08:00:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శనివారం అనగానే చాలా మందిలో ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. హిందూ ధర్మం ప్రకారం ఈ రోజు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గ్రహాలు, నక్షత్రాల గమనం ప్రతిరోజూ మారుతుంటుంది. దీని ప్రభావం మానవుల దైనందిన జీవితంపై స్పష్టంగా కనిపిస్తుంది.

శనివారం రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారికి అదృష్టం కలిసొచ్చే అవకాశం!
శనివారం రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారికి అదృష్టం కలిసొచ్చే అవకాశం!

కొందరికి కొత్త బాధ్యతలు ఎదురైతే, మరికొందరికి ఊహించని శుభవార్తలు అందుతాయి. మరి ఈ శనివారం మీ రాశి ఫలం ఏం చెబుతోంది? ఏయే రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి? పూర్తి వివరాలు చూద్దాం.

ఈరోజు రాశి ఫలాలు

మేష రాశి:

ఈ రోజు మీకు కొద్దిగా శారీరక అలసట, మానసిక అశాంతి ఎదురుకావచ్చు. చిన్న విషయాలకే ఎక్కువగా స్పందించే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రతి చిన్న దానికి స్పందించకుండా కాస్త విరామం తీసుకోండి.

వృషభ రాశి:

మనసు భారంగా అనిపించినా, ఇది మిమ్మల్ని మీరు బలంగా నిరూపించుకోవాల్సిన సమయం. భావోద్వేగాలను అణచివేయకుండా స్వీకరించండి. ప్రియమైన వారితో మాట్లాడటం ద్వారా మనసులోని భారం తగ్గుతుంది.

మిథున రాశి:

రోజు మీకు చాలా ఉత్సాహంగా సాగిపోతుంది. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. పాత స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో గడపడం వల్ల మనసు తేలికవుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.

కర్కాటక రాశి:

పరిస్థితులు మీ చేతిలో లేనట్లు అనిపించవచ్చు. అయితే అనవసర ఆందోళనలకు పోకుండా ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఈ రోజు సరైన సమయం. ఓపికతో వ్యవహరిస్తే సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి.

సింహ రాశి:

ఇతరులతో మనసు విప్పి మాట్లాడతారు. బంధాలు మరింత బలపడతాయి. గతంలో ఉన్న అపార్థాలు తొలగిపోయి, కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అంతర్గత శక్తి పెరుగుతుంది.

కన్య రాశి:

అధిక ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అయితే మనసులో మాటలను దాచుకోకుండా మాట్లాడితే సగం సమస్య అక్కడే తీరుతుంది. మాట్లాడేటప్పుడు పదాలను జాగ్రత్తగా ఎంచుకోవడం మంచిది.

తుల రాశి:

మనసులో ఏదో తెలియని సందిగ్ధత ఉంటుంది. ఎవరిపైనా వెంటనే అంచనాలు పెట్టుకోవద్దు. సంయమనం పాటించడం నేర్చుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.

వృశ్చిక రాశి:

కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో సమయం గడపడానికి ఈ రోజు అద్భుతంగా ఉంది. మనసులోని భావాలను దాచుకోకుండా పంచుకోండి. చిన్న చిన్న ఆశ్చర్యాలు లేదా ఆనందాలు మీకు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి.

ధనుస్సు రాశి:

నేడు ధనుస్సు రాశి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీలోని పరిపక్వత కనిపిస్తుంది. ఇతరులకు సాయం చేయడం ద్వారా మానసిక సంతృప్తి లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో మనసులోని విషయాలు పంచుకునే అవకాశం ఉంది.

మకర రాశి:

ఈ రోజు మీకు ఎంతో ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో గడుస్తుంది. నలుగురిలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ మనసులోని భావాలను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం.

కుంభ రాశి:

ఆరోగ్యం సహకరించకపోవచ్చు. ఒంటి నొప్పులు లేదా మానసిక బడలిక ఉండవచ్చు. అన్ని పనులూ మీరే చేయాలని ఒత్తిడికి గురికాకండి. విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.

మీన రాశి:

రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. గత కొంతకాలంగా వాయిదా పడుతున్న పనులకు శ్రీకారం చుడతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలను ఇతరులు గౌరవిస్తారు.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More