వరలక్ష్మీ వ్రతం పూజా సమయం నుంచి తాంబూలం వరకు.. పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు!

శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. ఈ రోజున బ్రహ్మ ముహూర్తం లేదా శుభ ముహూర్తంలో పూజ చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు పూజకు అనుకూలమైన సమయంగా పేర్కొంటున్నారు.  

Published on: Aug 20, 2026, 14:00:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తాము. వరలక్ష్మీ వ్రతాన్ని ఉదయం పూట, అందులో బ్రహ్మ ముహూర్తంలో వేళ్లేదా, శుభ ముహూర్తంలో చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాలను కలిగిస్తుంది. రేపు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే, సరైన సమయానికి చేసుకోవడం చాలా ముఖ్యమైనది. వరలక్ష్మీ వ్రతం ఏ సమయంలో ఆచరిస్తే మంచిది? పూజకు అనుకూలమైన ఉత్తమ సమయాలు ఏవో వివరంగా తెలుసుకుందాం.

వరలక్ష్మీ వ్రతం పూజా సమయం నుంచి తాంబూలం వరకు.. పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు! (pinterest)
వరలక్ష్మీ వ్రతం పూజా సమయం నుంచి తాంబూలం వరకు.. పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు! (pinterest)

దుర్ముహూర్తం, రాహుకాలం సమయంలో చేసుకోకూడదు. దుర్ముహూర్తం, రాహుకాలం సమయంలో నూతన కార్యాచరణ లేదా కలశ ప్రతిష్ఠ వంటి ముఖ్యమైన ఘట్టాలను ప్రారంభించకూడదు.

పూజకు అనుకూలమైన ఉత్తమ సమయాలు ఇవే

బ్రహ్మ ముహూర్తం: ఉదయం వేళ వరలక్ష్మీ వ్రతం ఆచరించాలనుకునే వారు బ్రహ్మ ముహూర్తం లేదా ఉదయం పూట వ్రతం చేసుకోవడానికి సరైన సమయం. పూజకు అత్యంత ప్రశస్తమైన సమయం ఉదయం నాలుగు నుంచి ఎనిమిది వరకు. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాతావరణంలో సానుకూల శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది.

ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే, దుర్ముహూర్తం ముగిశాక ఉదయం 9:06 నుంచి 10:30 మధ్య సమయంలో చేసుకోవచ్చు. ఈ సమయం కూడా పూజ చేసుకోవడానికి చాలా అనుకూలమైనదని చెప్పొచ్చు.

పూజ నిర్వహణలో ముఖ్యమైన విషయం సంకల్పం, కలశ స్థాపన:

పూజ మొత్తాన్ని ఒకే సమయంలో పూర్తి చేయాల్సిన అవసరమే లేదు. ఉదయం 9:04 నుంచి 8:00 మధ్యలో లేదా 9:06 నుంచి 10:30 మధ్యలో సంకల్పం చెప్పుకోవచ్చు. కలశ స్థాపన, అమ్మవారి ప్రతిష్ఠాపన చేసిన చాలు. తర్వాత నియమ నిష్ఠలతో అష్టోత్తరం చదవడం, నైవేద్యం సమర్పణ వంటివి చేయొచ్చు.

వ్రతం అయిపోయాక తాంబూలం కచ్చితంగా ఇవ్వాలి.. ఈ తప్పులు చేయొద్దు

వరలక్ష్మీ వ్రతం చేసుకున్నాక తాంబూలం ఇవ్వాలి. కానీ ఎడమ చేతితో తాంబూలాన్ని ఇవ్వకూడదు. కుడి చేతితో పట్టుకొని ఇవ్వడం మంచిది.

తాంబూలం ఇచ్చేటప్పుడు కొన్ని వస్తువులను తప్పక పెట్టండి. పసుపు, కుంకుమ, తమలపాకులు, రూపాయి కాసు, పువ్వులు, గాజులు, పండ్లు. కొందరు తెలియక కొబ్బరికాయ కూడా ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వకూడదు.

అరటిపండు తమలపాకుపై పెట్టి కొన మీ వైపుకు ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే ఇచ్చిన తాంబూలానికి తగిన ఫలితం దక్కుతుంది.

చిరిగిపోయిన ఆకులు, పాడైపోయిన వాటిని తాంబూలంలో ఇవ్వకూడదని గుర్తుపెట్టుకోండి. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More