వరలక్ష్మీ వ్రతం రోజున ఈ శ్లోకాలు చదవండి.. అమ్మవారి అనుగ్రహం పొందండి
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించడం హిందూ సంప్రదాయంలో విశేషమైనదిగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని నియమ నిష్ఠలతో పూజిస్తూ దీప, ధూప, నైవేద్యాలను సమర్పించి, వ్రతకథతో పాటు అమ్మవారి శ్లోకాలు, మంత్రాలను పఠించడం శుభప్రదంగా భావిస్తారు.
వరలక్ష్మీ వ్రతం నాడు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. హిందూ సంప్రదాయాల్లో శ్రావణమాసానికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పవిత్ర మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీదేవిని ఆరాధించే ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి, సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

ఈ వ్రతాన్ని ఆచరించే మహిళలు కొన్ని నియమ నిబంధనలు కూడా తప్పక పాటించాలి. అలాగే వరలక్ష్మీ వ్రతం నాడు వ్రతకథలతో పాటు శ్లోకాలను చదువుకోవడం మంచిది. ఈ అమ్మవారి శ్లోకాలను చదువుకొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించండి.
అలాగే వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారిని ఆరాధించేటప్పుడు దీప, ధూప, నైవేద్యాలను సమర్పించండి. అమ్మవారికి తొమ్మిది రకాల పిండి వంటలను చేసి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది.
లక్ష్మీ ధ్యాన శ్లోకం
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే
ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః
సౌభాగ్యం కోసం
సిద్ధిబుద్ధిప్రదే దేవి
భుక్తిముక్తి ప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి
మహాలక్ష్మి నమోస్తుతే..
మంగళ శ్లోకం
సర్వమంగళ మాంగల్యే
శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి
నారాయణి నమోస్తుతే
మహాలక్ష్మీ నమస్కార శ్లోకం
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే..
లక్ష్మీ గాయత్రీ మంత్రం
ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే
విష్ణుపత్న్యై చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్..
లక్ష్మీదేవి శ్లోకం
నమస్తేస్తు మహాదేవి మహాభయ వినాశిని
మహాదుఃఖ ప్రశమని మహాలక్ష్మి నమోస్తుతే..
సంపద కోసం శ్లోకం
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే..
కుటుంబ శ్రేయస్సు కోసం
ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి
ధైర్యలక్ష్మి గజలక్ష్మి
సంతానలక్ష్మి విజయలక్ష్మి
విద్యాలక్ష్మి నమోస్తుతే..
క్షేమం కోసం
యా దేవీ సర్వభూతేషు
లక్ష్మీ రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై
నమస్తస్యై నమో నమః
విష్ణుపత్నీ లక్ష్మీ స్తోత్రం
విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగత్ప్రియే
నమస్తుభ్యం జగద్ధాత్రి నమస్తుభ్యం నమో నమః
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


