...
...
Next Story

డిసెంబర్ 5 నుంచి వీరికి గురు బలం తగ్గుతుంది.. ఈరోజు గురు పౌర్ణమి+కృత్తిక నక్షత్రం+దత్తాత్రేయ జయంతి కనుక ఇలా చేయండి!

ఈరోజు గురువారం, పౌర్ణమి, కృత్తికా నక్షత్రం, దత్త దత్తాత్రేయ జయంతి రావడం కూడా చాలా విశేషం. ఇంతటి విశిష్టమైన రోజున కొన్ని పరిహారాలను పాటించడం వలన ఆనందంగా ఉండొచ్చు. కెరియర్‌లో కూడా మార్పులు వస్తాయి. దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి వీలు అవుతుంది.

Published on: Dec 4, 2025, 08:00:12 IST
Advertisement

ఈరోజు కేవలం మార్గశిర మాసంలో వచ్చే గురువారమే కాదు, ఈరోజు గురువారం, పౌర్ణమి, కృత్తికా నక్షత్రం, దత్త దత్తాత్రేయ జయంతి రావడం కూడా చాలా విశేషం. ఇంతటి విశిష్టమైన రోజున కొన్ని పరిహారాలను పాటించడం వలన ఆనందంగా ఉండొచ్చు. కెరియర్‌లో కూడా మార్పులు వస్తాయి. దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి వీలు అవుతుంది. మరి ఇంతటి విశిష్టమైన రోజున ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలను పాటిస్తే జీవితం మారుతుంది? ఇటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గురు బలం పెరుగుతుంది

ఈరోజు గురు పౌర్ణమి+కృత్తిక నక్షత్రం+దత్తాత్రేయ జయంతి (pinterest)
ఈరోజు గురు పౌర్ణమి+కృత్తిక నక్షత్రం+దత్తాత్రేయ జయంతి (pinterest)

ఈరోజు కొన్ని పరిహారాలను పాటించడం వలన గురు బలం పెరిగే అవకాశం ఉంది. మేష రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్య రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీన రాశి వారికి గురు బలం తగ్గుతుంది. వారు కచ్చితంగా గురు బలాన్ని పెంచుకోవడానికి కొన్ని పరిహారాలను ఈ విశిష్టమైన రోజున పాటించడం మంచిది.

డిసెంబర్ 5 నుంచి ఈ రాశుల వారికి గురు బలం తగ్గబోతోంది, కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా పాటించాలో చూసుకోవాలి. గురు బలం తగ్గడం వలన ఆర్థిక సమస్యలు, పెళ్లి విషయంలో సమస్యలు, కెరియర్‌లో ఇబ్బందులు ఇలాంటివి చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది.

ఈరోజు చేయాల్సిన పరిహారాలు

1. శివారాధన

ఈరోజు సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్లి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయించండి.

2. దోష నివారణ

కుజ దోషం, సర్ప దోషం వంటి వాటితో ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు పరిహారాలను పాటిస్తే బాగుంటుంది.

3. గురు మంత్ర జపం

ఈ మంత్రాన్ని పఠిస్తే కూడా గురు బలం కలుగుతుంది: “దేవానాంచ రుషినాంచ గురుం కాంచన సన్నిభం, బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం” అనే మంత్రాన్ని కనీసం 16 సార్లు అయినా ఈ మంత్రాన్ని జపించేలా చూసుకోండి. జాతకంలో గురువు స్థానం బలంగా ఉండి, ఎలాంటి ఇబ్బంది అయినా తొలగిపోతుంది.

4. గురువు గారికి గౌరవం

దక్షిణామూర్తి ఆలయం లేదా దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి వెళ్లి ఆరాధిస్తే మంచిది.

6. దత్త చాలీసా

దత్త చాలీసాను వింటే శుభఫలితాలు ఎదురవుతాయి. కుదిరితే చంద్రుని వెలుగులో దత్త చాలీసాను చదవడం లేదా వినడం మంచిది.

7. దాన ధర్మాలు

పేదలకు ఆహారం ఇవ్వడం, దానాలు చేయడం వలన కూడా గురు బలాన్ని పెంచుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe