...
...
Next Story

ఈరోజు షష్టి+ఆశ్లేష నక్షత్రం+బుధవారం.. సంతాన యోగం కలగడానికి, గ్రహ దోషాలు తొలగిపోవడానికి పరిహారాలు!

జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే చాలా మంది గ్రహ దోషాలతో బాధపడుతూ ఉంటారు. అలాగే సంతానం లేక చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇది అమూల్యమైన రోజు అని చెప్పవచ్చు. సంతాన యోగం కలగడానికి ఈరోజు కొన్ని పరిహారాలను పాటించండి. కుజ దోషం, రాహు–కేతు దోషాల నుంచి బయటపడడానికి కూడా వీలవుతుంది.

Published on: Dec 10, 2025, 08:00:14 IST
Advertisement

ప్రతి ఒక్కరూ ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉండాలని అనుకుంటారు. కానీ కొన్ని సార్లు జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే చాలా మంది గ్రహ దోషాలతో బాధపడుతూ ఉంటారు. అలాగే సంతానం లేక చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఇది అమూల్యమైన రోజు అని చెప్పవచ్చు.

షష్టి, ఆశ్లేష నక్షత్రం

ఈరోజు షష్టి+ఆశ్లేష నక్షత్రం+బుధవారం (pinterest)
ఈరోజు షష్టి+ఆశ్లేష నక్షత్రం+బుధవారం (pinterest)

డిసెంబర్ 10 అంటే ఈరోజు షష్టి, ఆశ్లేష నక్షత్రం రావడం చాలా విశేషం. ఈరోజును సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే సమస్యలన్నీ తొలగి ఆనందంగా ఉండొచ్చు. సంతాన యోగం కలగడానికి ఈరోజు కొన్ని పరిహారాలను పాటించండి. అలాగే కుజ దోషం, రాహు–కేతు దోషాల నుంచి బయటపడడానికి కూడా వీలవుతుంది. అలాంటి సమస్యలు కలిగిన వారు ఈ రోజు ఏమి చేయాలి? ఎలా పూజించాలి? పాటించాల్సిన పరిహారాలు ఏంటి? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు షష్టి, ఆశ్లేష నక్షత్రం, బుధవారం

ఈరోజు షష్టి, ఆశ్లేషా నక్షత్రం, బుధవారం మూడు కలిసి రావడం చాలా విశేషం అని చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. సంతానం కలగడానికి ఈరోజు కొన్ని పద్ధతులను పాటిస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. ఈరోజు అనేక సార్లు సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోండి. దీంతో సంతానం కలిగి ఆనందంగా ఉంటారు. దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి రెండు తలల నాగరాజుకి పాలను తో అభిషేకం చేస్తే కూడా మంచిది.

అలాగే "ఓం శ్రీ శరవణభవాయ నమః" అనేది మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం జపిస్తే చక్కటి ఫలితాన్ని చూస్తారు. ఆదిశేషుడిని ఆరాధిస్తూ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే కూడా చక్కటి ఫలితాన్ని చూస్తారు. అలా చేయలేకపోతే వెంకటేశ్వర రుద్రకవచం అయినా చదువుకోండి.

హే స్వామినాథ కరుణాకర దీనబంధో,

శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో

శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్..

దేవాదిదేవనుత దేవగణాధినాథ,

దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద

దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్..

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్

తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ

శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్..

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల

పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే

శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్..

దేవాదిదేవ రథమండల మధ్య వేద్య

దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్

శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్..

హారాదిరత్నమణియుక్తకిరీటహార,

కేయూరకుండలలసత్కవచాభిరామ

హే వీర తారక జయాఽమరబృందవంద్య

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్..

పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః

పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః

పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్..

శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,

కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్

భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్..

సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః

తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః

సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్

కోటిజన్మకృతం పాపం తత్​క్షణాదేవ నశ్యతి..

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks