ఈరోజు గురువారం+ కుబేరుని జన్మ నక్షత్రంలో సంకటహర చతుర్థి.. వీటిని పాటిస్తే సుఖ సంతోషాలు, విజయాలే!

ప్రతి ఒక్కరూ విఘ్నాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అలాంటి సమయంలో సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని ఆరాధించి, సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మామూలు రోజు కాదు. ఈరోజు గురువారం+ కుబేరుని జన్మ నక్షత్రం+ సంకటహర చతుర్థి రావడం చాలా విశేషమైనది.

Published on: Feb 5, 2026, 07:01:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరూ విఘ్నాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండాలని అనుకుంటారు. అలాంటి సమయంలో సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని ఆరాధించి, సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. సంకటహర చతుర్థి నాడు గణపతిని ఆరాధించడం వలన జీవితంలో ఉన్న విఘ్నాలు తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని పొందవచ్చు.

ఈరోజు గురువారం+ కుబేరుని జన్మ నక్షత్రం+ సంకటహర చతుర్థి (pinterest)
ఈరోజు గురువారం+ కుబేరుని జన్మ నక్షత్రం+ సంకటహర చతుర్థి (pinterest)

నేడే సంకటహర చతుర్థి

రోజు అనగా ఫిబ్రవరి 5న ఉదయం 12:09కి చతుర్థి తిథి మొదలై, ఫిబ్రవరి 5 అర్ధరాత్రి 12:09 వరకు ఉంటుంది. కనుక ఈరోజు ఉపవాసం ఉండి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే మంచిది. ఉపవాసాన్ని ఈరోజు రాత్రి చంద్రోదయం తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. ఫిబ్రవరి 5, అనగా ఈరోజు, రాత్రి 9:50 గంటలకు చంద్ర దర్శనం అవుతుంది.

ఈరోజు గురువారం+ కుబేరుని జన్మ నక్షత్రంలో సంకటహర చతుర్థి

ఈరోజు మామూలు రోజు కాదు. ఈరోజు గురువారం+ కుబేరుని జన్మ నక్షత్రంలో సంకటహర చతుర్థి రావడం చాలా విశేషమైనది. ఈరోజు కుబేరుడి ఉత్తర నక్షత్రం కావడం వల్ల సరిగ్గా రోజుని సద్వినియోగం చేసుకోండి. అప్పులు తొలగిపోవడానికి, ఆదాయం పెరగడానికి, సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండడానికి ఈ రోజును సరిగ్గా వినియోగించుకుంటే మంచిది.

  • కుబేర అష్టోత్తర శతనామావళి చదువుకుంటే ఉత్తమ ఫలితాలను చూడవచ్చు. అప్పులు కూడా తీరిపోతాయి.
  • గణేశ పంచరత్నం, సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకుంటే కూడా మంచిది.
  • ఈరోజు గురువారం కావడంతో దక్షిణామూర్తి శ్లోకం చదువుకుంటే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.
  • ఈరోజు ఉపవాసం ఉన్నట్లయితే శుభ సమయంలో పూజలు చేయాలి. అలాగే చంద్ర దర్శనం తర్వాత చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి, ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించాలి.

చాలా మంది సంకటహర చతుర్థి నాడు భక్తిశ్రద్ధలతో వినాయకుడిని ఆరాధించి ఉపవాసం ఉంటారు. ఆర్థిక సమస్యలు, అడ్డంకులు, అప్పుల బాధలను తొలగించుకోవడానికి ఇది అద్భుతమైన రోజు.

ఈరోజు వినాయకుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సానుకూలత కూడా పెరుగుతుంది. విఘ్నాధిపతి అయిన వినాయకుడు అడ్డంకులను తొలగిస్తాడు. తెలివితేటలు, జ్ఞానానికి వినాయకుడే అధిపతి. ఆయన కటాక్షం ఉంటే అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More