తెలుగు సంస్కృతిలో అట్లతద్ది పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పండుగను ఆడపడుచులందరూ సంతోషంగా జరుపుకుంటారు. మహిళలు, యువతులు ఎంతో ఉత్సాహంగా అట్లతద్దిని జరుపుతారు.

ఈ పర్వదినం భక్తికి, కుటుంబ అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది. గౌరీదేవిని ఆరాధిస్తూ వైవాహిక జీవితం, కుటుంబ సౌఖ్యం కలగాలని కోరుకుంటారు. అట్లతద్ది రోజు ఉయ్యాల ఊగడం, ఉదయాన్నే చద్దన్నం తినడం, గోరింటాకులు పెట్టుకోవడం ఇలా రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి. పార్వతీ పరమేశ్వరుల కథతో పాటు, ఎందుకు ఉయ్యాల ఊగడం వంటి వివరాలను తెలుసుకుందాం.
పార్వతీ పరమేశ్వరుల కథ
హిందూ సంప్రదాయంలో పార్వతీ పరమేశ్వరులను ఆదర్శ దంపతులు అంటారు. శివుడిని భర్తగా పొందాలని పార్వతీదేవి తపస్సు చేస్తుంది. ఆమె భక్తి, పట్టుదల చివరకు శివుడి అనుగ్రహాన్ని పొందడానికి కారణమవుతాయి. గౌరీదేవిని ఆరాధించడం ద్వారా సౌభాగ్యం కలుగుతుందని, దాంపత్య సంతోషాన్ని కూడా పొందవచ్చని విశ్వసిస్తారు.
అట్లతద్ది నాడు మహిళలు గౌరీదేవిని భక్తితో ఆరాధిస్తారు. పెళ్లయిన వారు కుటుంబంలో సుఖసంతోషాలు ఉండాలని, పెళ్లికాని వారు తమ జీవితంలోకి మంచి భర్త రావాలని కోరుకుంటారు. అట్లతద్ది పండుగకు సంబంధించి పార్వతీ పరమేశ్వరుల కథ ఆ ప్రాంతాన్ని బట్టి మారుతుంది.
ఎందుకు ఉయ్యాల ఊగుతారు?
అట్లతద్ది నాడు ఉయ్యాల ఊగడం ఆకర్షణీయమైన సంప్రదాయాల్లో ఒకటి. తెల్లవారుజామున లేచి స్నానం చేసే మహిళలు, చద్దన్నం తిని ఉయ్యాల ఊగుతారు. స్నేహితులు, బంధువులతో కలిసి ఉయ్యాల ఊగుతూ పాటలు పాడతారు. దీని వెనుక పురాణ కారణం ఉందని అంటారు.
సంప్రదాయపరంగా చూసినట్లయితే, ఉయ్యాల ఆనందానికి, ఉత్సాహానికి ప్రతీకగా నిలుస్తుంది. అందరూ కలిసి ఒకచోట చేరి పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ ఉంటే వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇలా సంతోషంగా అట్లతద్దిని జరుపుకోవడం వెనుక ఇలాంటి సంప్రదాయాలు ఉన్నాయి.
అట్ల వాయనం
అట్లతద్ది పేరులోనే అట్లకు ఉన్న ప్రాధాన్యత మనకు కనిపిస్తుంది. అట్లతద్ది నాడు అట్లను వాయనంగా ఇస్తారు. 11 అట్లు వేసి వాటిని నైవేద్యంగా సమర్పించి, వాయనంగా ఇస్తారు. అట్లతద్ది కేవలం ఒక వ్రతం మాత్రమే కాదు. అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే సాంస్కృతిక వేడుక.
అట్లతద్ది నాడు పాటించే సంప్రదాయాలు
{{/usCountry}}అట్లతద్ది పేరులోనే అట్లకు ఉన్న ప్రాధాన్యత మనకు కనిపిస్తుంది. అట్లతద్ది నాడు అట్లను వాయనంగా ఇస్తారు. 11 అట్లు వేసి వాటిని నైవేద్యంగా సమర్పించి, వాయనంగా ఇస్తారు. అట్లతద్ది కేవలం ఒక వ్రతం మాత్రమే కాదు. అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే సాంస్కృతిక వేడుక.
అట్లతద్ది నాడు పాటించే సంప్రదాయాలు
{{/usCountry}}తెల్లవారుజామున లేవడం: మహిళలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, సంప్రదాయబద్ధంగా ఈ వ్రతాన్ని ప్రారంభిస్తారు.
చద్దన్నం తినడం: కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున నిద్రలేచి చద్దన్నం తింటారు. ముఖ్యంగా ఉల్లిపాయ పులుసు, కందిపొడి, గోంగూర పచ్చడి వంటివి ఉంటాయి.
గోరింటాకు: మహిళలు, యువతులు చేతులకు గోరింటాకు పెట్టుకుని పండుగకు ప్రత్యేక శోభను తీసుకొస్తారు.
గౌరీదేవి ఆరాధన: అమ్మవారిని పసుపు, కుంకుమలు, పూలతో పూజించి, తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు.
అలాగే, ఉయ్యాల ఊగడం, అట్లను వాయనంగా ఇవ్వడం, రాత్రి చంద్రుడిని చూసిన తర్వాత మాత్రమే అట్లను తినడం వంటివి పాటిస్తారు.