ఈరోజు చాలా శక్తివంతమైన రోజు. గురువారం, పైగా పుష్యమి నక్షత్రం, పంచమి తిధి ఉంది. ఇది చాలా అరుదైన పవిత్ర కలయిక అని చెప్పవచ్చు. గురు పుష్యమి యోగం చాలా పవిత్రమైనది. ఎప్పుడైనా సరే గురువారం రోజు పుష్యమి నక్షత్రం వచ్చినట్లయితే దానిని గురు పుష్యమి యోగం అని అంటారు.

ఈ రోజును సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే అక్షయ ఫలితాలు కలుగుతాయి. ఈ యోగంలో చేసే శుభకార్యాలకు ఎంతో మంచి ఫలితం లభిస్తుంది. అలాగే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా, ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా ఇది చాలా శుభదినం. బంగారం, విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా గురు పుష్యమి చాలా శుభప్రదమైన రోజు.
యాలకుల పరిహారాలు
లక్ష్మీదేవి ఫోటో ముందు రెండు యాలకులను పెట్టి పూజ చేసి, పూజ అయిన తర్వాత డబ్బు దాచుకునే చోట పెట్టండి. ఖర్చులు తగ్గి కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి.
మహాలక్ష్మీ దేవి అనుగ్రహం
ఈరోజు ఇంట్లో దీపారాధన చేయడం వలన మహాలక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది.
ఈరోజు దీపారాధన చేసి మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన దరిద్రం తొలగిపోయి శుభ ఫలితాలను పొందవచ్చు.
అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర పుష్పాలను ఈరోజు సమర్పించండి. అష్టైశ్వర్యాలు, ధన లాభం కలుగుతాయి.
ఈ మంత్రాలను జపిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
ఈ గురు పుష్యమి యోగ వేళ “ఓం నమో నారాయణాయ” లేదా “ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః” అనే మంత్రాలను జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షంతో సంతోషంగా ఉండొచ్చు. ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది. మళ్లీ మళ్లీ ఇలాంటి అద్భుతమైన రోజు రాదు. కాబట్టి సరిగ్గా సద్వినియోగం చేసుకుని మహాలక్ష్మీ దేవిని భక్తితో ఆరాధించండి.
గురు పుష్యమి వేళ ఈ పసుపు పరిహారం పాటించండి
గురు పుష్యమి నక్షత్రంలో పసుపు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. ఒక చిన్న ఐదు రూపాయల పసుపు కొన్నా ఇంట్లో ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. ఆ పసుపును తీసుకువచ్చి విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని ఆరాధించండి. ఎంతో సంపద కలుగుతుంది.
దానానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి
{{/usCountry}}గురు పుష్యమి నక్షత్రంలో పసుపు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. ఒక చిన్న ఐదు రూపాయల పసుపు కొన్నా ఇంట్లో ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. ఆ పసుపును తీసుకువచ్చి విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని ఆరాధించండి. ఎంతో సంపద కలుగుతుంది.
దానానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి
{{/usCountry}}లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే దానానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి నెల మీకు వచ్చే కొంత డబ్బులు దేవుని పేరు మీద ఏదో ఒక ఆలయానికి వెళ్లి విరాళం ఇవ్వండి. దాంతో భగవంతుడు దయ మీపై ఉంటుంది. అలాగే మీ దగ్గర ఉన్న కొంత డబ్బును సామాజిక సేవ కోసం ఖర్చు చేయండి. ఈ విధంగా పాటిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి.