అమావాస్య తిధికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈరోజు ఫిబ్రవరి 17, మంగళవారం, మాఘ అమావాస్య. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఈరోజు అమావాస్య పైగా సూర్య గ్రహణం, పైగా పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. ఈరోజు కొన్ని నియమాలను పాటించినట్లయితే కష్టాలన్నీ తీరిపోతాయి. ఈరోజు గ్రహణ సమయంలో పాటించాల్సినవి, అమావాస్య విధి విధానాల గురించి చూసేద్దాం.
సూర్యగ్రహణం, మాఘ అమావాస్య

ఈరోజు మధ్యాహ్నం 3:20 నుంచి రాత్రి 08:00 వరకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే భారతదేశంలో కనిపించదు, సూతక కాలం కూడా పరిగణించబడదు. గ్రహణ నియమాలు పాటించకపోయినా, ఈ శక్తివంతమైన రోజు అమావాస్య నియమాలను పాటించేటట్టు చూసుకోండి.
మాఘ అమావాస్య నాడు సమస్యలు తొలగిపోవాలంటే ఈ శక్తివంతమైన పరిహారాలు పాటించండి
గుమ్మడికాయ, నల్లదారం
అమావాస్య నాడు దుష్టశక్తుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంటి గుమ్మం ముందు బూడిద గుమ్మడికాయను కట్టుకుంటే మంచిది. గుమ్మడికాయను కట్టడం వలన కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీలైతే కాళ్లకు నల్ల దారం కట్టుకోండి. ఆడవారు ఎడమ కాలికి, మగవారు కుడి కాలికి నల్ల దారం కట్టుకుంటే మంచిది. నరదిష్టి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. లక్ష్మీకటాక్షం కూడా కలుగుతుంది.
నెయ్యి దీపాలను వెలిగించండి
అమావాస్య రోజు లక్ష్మీదేవికి నెయ్యి దీపాలను వెలిగిస్తే మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు ఇదే. కనుక పేదరికంతో బాధపడుతున్న వారు, సమస్యలు ఉన్నవారు వాటిని తొలగించుకోవడానికి లక్ష్మీదేవి ఎదుట నెయ్యి దీపాలను పెట్టండి. రెండు నెయ్యి దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం వలన అఖండ రాజయోగం కలుగుతుంది.
నారపీడ పరిహారాలు
ఈ శక్తివంతమైన రోజు నీటిలో ఉప్పు వేసి స్నానం చేస్తే నరపీడ మొత్తం తొలగిపోతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం కలగాలంటే స్నానం చేసే నీళ్లలో యాలకులను వేసి స్నానం చేయడం మంచిది. అప్పుల బాధలతో సతమతమవుతున్న వారు ఈ అమావాస్య నాడు బీరువాను ఒక తడిగుడ్డతో తుడిచి, దానిపై గంధం రాసి బొట్టు పెట్టండి.
ఐశ్వర్యం కలగాలంటే ఇలా చేయండి
{{/usCountry}}ఈ శక్తివంతమైన రోజు నీటిలో ఉప్పు వేసి స్నానం చేస్తే నరపీడ మొత్తం తొలగిపోతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం కలగాలంటే స్నానం చేసే నీళ్లలో యాలకులను వేసి స్నానం చేయడం మంచిది. అప్పుల బాధలతో సతమతమవుతున్న వారు ఈ అమావాస్య నాడు బీరువాను ఒక తడిగుడ్డతో తుడిచి, దానిపై గంధం రాసి బొట్టు పెట్టండి.
ఐశ్వర్యం కలగాలంటే ఇలా చేయండి
{{/usCountry}}తమలపాకులు ధనలక్ష్మీ దేవిని ఇంటికి తీసుకొస్తాయి. కాబట్టి ఈ శక్తివంతమైన రోజున పర్సులో రెండు తమలపాకులను పెట్టుకుని, కొన్ని వాస్తు పాటించండి. అనవసరమైనవి, పాత కాగితాలు, బిల్లులు వంటివి తొలగించండి. ఎప్పుడూ కూడా పర్సులో అనవసరమైనవి, పాత కాగితాలు వంటివి ఉండకూడదు. ఎప్పటికప్పుడు పర్సును శుభ్రం చేసుకోవాలి.
ఇవి కూడా పాటిస్తే మంచిది
- అమావాస్యనాడు మాంసాహారం తినడం కూడా మంచిది కాదు.
- సాయంత్రం 6 తర్వాత ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలను వెలిగించండి. ఆ తర్వాత ఆ దీపం నూనెలో యాలకులను వేయండి. దీంతో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది. బాధలన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.
- అదృష్టం కలిసి రావాలంటే అమావాస్య నాడు నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి. దీంతో అదృష్టం కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు కూడా తొలగిపోతాయి.
- అమావాస్య నాడు సాయంత్రం రావి చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేయండి. కుదిరితే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి.
- వివాహంలో ఆటంకాలు ఏర్పడుతున్న వారు అమావాస్య నాడు మర్రిచెట్టుకు పసుపు దారాన్ని కట్టి ప్రదక్షిణలు చేయడం మంచిది. అలాగే సంతానం కావాలనుకునే వారు కూడా ఈ పరిహారాన్ని పాటించొచ్చు.
- మంగళవారం కనకదుర్గమ్మకు ఇష్టమైన రోజు. కాబట్టి అమావాస్య మంగళవారం వచ్చినందున రాహుకాలంలో అమ్మవారి ఆలయానికి వెళ్లి నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే మంచిది. ఇలా ఈ పరిహారాలను పాటించినట్లయితే ఏ సమస్యలైనా తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.